దామరగిద్ద, జూన్ 4: పల్లెల్లో ప్రగతి కనిపించాలని నారాయణపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ వనజమ్మ అన్నారు. శనివారం 5వ విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మండంలోని ముస్తాపేట గ్రామాన్ని పరిశీలించారు. అనంతరం నర్సరీలో మొక్కలను పరిశీలించారు. పాఠశాలకు వెళ్లి తరగతి గదులను పరిశీలించారు. అనంతరం పల్లె ప్రకృతి వనంలో మొక్కలను పరిశీలించారు. డంపింగ్ యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లెల్లో నిజంగా ప్రగతి కనిపించాలన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లాలప్ప, ప్రత్యేక అధికారి దూస వెంకట్రాములు, సర్పంచ్ లాలప్ప, గ్రామ యువకులు పాల్గొన్నారు.
మరికల్, జూన్ 4: పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతిపల్లె ఆభివృద్ధ్ది చెందుతుందని ఎంపీపీ శ్రీకళరాజవర్ధన్రెడ్డి ఆన్నారు. శనివారం పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పెద్ద చింతకుంట గ్రామంలో పర్యటించారు. గ్రామంలో చేపట్టిన పనులను పరిశీలించారు. అలాగే ఆంగన్వాడీ కేంద్రాన్ని, బాడిబాట కార్యక్రమాన్ని పరిశీలించారు. ఉపాధి కూలీలతో మాట్లాడి రోజూ పనిచేసే విధానం తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యాక్రమంలో హరితహారంలో మొక్కలు నాటడం, వైకుంఠధామాల నిర్మాణం, క్రీడాప్రాంగణాల నిర్మాణం తదితర పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు మతీన్, గ్రామసర్పంచ్ శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ మంజుల, ఎంపీడీవో యశోదమ్మ తదితరులు పాల్గొన్నారు.