హైదరాబాద్, ఆట ప్రతినిధి: న్యూఢిల్లీలోని త్యాగరాజ స్టేడి యం వేదికగా ఆలిండియా సివిల్ సర్వీసెస్ చెస్ టోర్నీలో తెలంగాణ తరఫున సత్యనారాయణ పోటీపడుతున్నాడు. సంగారెడ్డికి చెందిన సత్యనారాయణ.. ఇస్మాయిల్‌ఖాన్‌పేట జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గతంలో మూడుసార్లు రాష్ట్ర జట్టు తరఫున పోటీపడ్డ సత్యనారాయణ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 2018లో భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ చెస్ టోర్నీతో పాటు అదే ఏడాది రాంచీలో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ టోర్నీలో తెలంగాణ జట్టుకు నాయకత్వం వహించాడు. ఢిల్లీలో జరిగే టోర్నీలో మెరుగైన ప్రదర్శన కనబరిచి రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.