రాష్ట్ర అవతరణ వేడుకలు గురువారం అంబరాన్నంటాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో మువ్వన్నెల జెండాను అతిథులు ఎగురవేశారు. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.
కవిసమ్మేళనాలు అలరించాయి. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. మహబూబ్‌నగర్ పరేడ్ గ్రౌండ్లో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. నాగర్ కర్నూల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నారాయణపేటలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. జిల్లాలో జరిగిన అభివృద్ధినివారు వివరించారు.
రాష్ట్ర అవతరణ వేడుకలు అంబురాన్నంటాయి.. గురువారం ఊరూవాడా, పల్లె, పట్నం తేడా లేకుండా జాతీయ జెండా రెపరెపలాడింది.. అమరవీరుల స్తూపాల వద్ద నివాళులర్పించారు.. వారి పోరాట పటిమను స్మరించుకున్నారు.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాలు, భవనాల వద్ద జెండాను ఆవిష్కరించారు.. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో అద్భుత ఫలితాలు సాత్కారమయ్యాయని పలువురు నేతలు కొనియాడారు.. గ్రామాలు, పట్టణాల్లో జరిగిన అభివృద్ధిని వివరించారు.. ఆత్మబలిదానాలు చేసుకున్న వారి కుటుంబసభ్యులను సత్కరించారు.. అవతరణ దినోత్సవం సందర్భంగా క్రీడా మైదానాలను ప్రారంభించారు..
-నెట్వర్క్ మహబూబ్‌నగర్,జూన్ 2