కొత్తకోట, జూన్ 2 : ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉంటే అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు మీ ఇంటికే వస్తాయని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ అండగా ఆయన నిలిచారన్నారు. మ హబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలం అన్నాసాగర్ గ్రామంలో ఎమ్మెల్యే ఆల సమక్షంలో గురువారం వనపర్తి జిల్లా వడ్డెవాట, వడ్డెవాట తండాకు చెం దిన 100 మంది మహిళలు, యువకులు, గిరిజనులు కాంగ్రెస్ పార్టీని వీడి టీ ఆర్ఎస్లో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే సాదరంగా ఆ హ్వానించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం గా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని తెలిపారు.
రైతుల కోసం నిరంతరం సీ ఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, రైతుబంధు సమితి అధ్యక్షుడు కొండారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాలకృష్ణ, నాయకులు లక్ష్మీకాంతారెడ్డి, పుల్యానాయక్, లక్ష్మి, త్యాగరాజ్, మండ్ల రవి, రాములు, మంగ మ్మ, గోపాల్‌నాయక్, వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.