నాగర్‌కర్నూల్, జూన్ 2 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణకు అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించి నేటికి ఎనిమిది వసంతాలు పూర్తయ్యాయని, మనం కలలుగంటున్న బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా మనం ప్రవేశపెట్టిన ప్రణాళికలు సత్ఫలితాలనిస్తూ, నిరంతర ప్రగతశీల రాష్ట్రంగా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు.
గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గువ్వల ముఖ్యఅతిథిగా హాజరై జాతీ య జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపానికి జెడ్పీచైర్‌పర్సన్ పద్మావతి, కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎస్పీ మనోహర్‌లతో కలిసి నివాళులర్పించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై కలెక్టర్, ఎస్పీలతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల ను ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ముఖ్యులతో కలిసి విప్ తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చారకొం డ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ప్రతి పేద దళిత కుటుంబానికి సాయం అందజేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 301 లబ్ధిదారులను గుర్తించిన ట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పేద, ఎస్టీ కు టుంబాల సామాజిక ఆర్థికాభివృద్ధి కోసం అచ్చంపేటకు రూ.3.50 కోట్లతో 175 మంది లబ్ధిదారులకు పాడి గే దెల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో భూమిలేని దళిత మహిళలకు 3 ఎకరాల చొప్పున ఇ ప్పటివరకు రూ.15.33 కోట్లతో 187 మంది లబ్ధిదారులకు 360 ఎకరాలకుపైగా భూమి పంపిణీ చేశామన్నారు.
ఆయిల్‌పాం తోటల సాగు చేయడానికి పైలట్ ప్రాజెక్టు కింద 2020-21లో 221.75 ఎకరాలు, 20 22-23 సంవత్సరానికి 3 వేల ఎకరాలు సాగుకు ప్ర ణాళికలు సిద్ధం చేశామన్నారు. అచ్చంపేట బ్రాంచ్ కెనాల్ పొడిగింపు, చంద్రసాగర్ ఫీడర్ చానల్‌కు 598 ఎకరాల భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నాయన్నా రు. చంద్రసాగర్ రిజర్వాయర్ నుంచి వెయ్యి ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. ప్రజలకు రా ష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారంలో విశిష్ట సేవలు అందించిన మున్సిపల్ చైర్మన్లు, కమిషన ర్లు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులను ప్రశంసాపత్రాలతో సత్కరించారు. రెడ్‌క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, అదనపు ఎస్పీ రామేశ్వర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ కల్పనా భాస్కర్‌గౌడ్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, ప్ర జాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.