నారాయణపేట, జూన్ 2 : బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రంలో అడుగులు పడుతున్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సలహాదారు రమణాచారి పే ర్కొన్నారు. ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు ఉండేందుకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, కలెక్టర్ హరిచందన, ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి ఆ యన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స మర్పించారు. అక్కడే ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యేలు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ ప్రజలు కలలుగంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఈ ఎనిమిదేండ్లు అడుగులు వేసినట్లు తెలిపారు. తెలంగాణ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. అందుకే ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నట్లు చెప్పారు.
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ప్రగతి బాటలకు సహకారం అందించాలని కోరారు. దశాబ్దాల కాలంపాటు మనం చేసిన పోరాటానికి సార్థకతగా భావించవచ్చని చెప్పారు. వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతి, అమలు చేస్తున్న పథకాలు దేశ, విదేశాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయని స్పష్టం చే శారు. అనంతరం జిల్లాలో చేపట్టిన ప్రగతి నివేదికను ఆయన చదివి వినిపించారు. 2021-22 యాసంగిలో 1,67,313 మంది రైతుల ఖాతాల్లో రూ. 229.55 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారుగా 2,756 కుటుంబాలకు రైతుబీమా కింద రూ.135.8 కోట్లు అందజేశామన్నారు. క్రీడాప్రాంగణాల కోసం జిల్లాలోని 336 గ్రామాల్లో స్థలాలను గుర్తించామన్నారు. 32 గ్రామాల్లో పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. 11 మండలాల్లో 55 బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామన్నారు. 4,143 మంది లబ్ధిదారులకు రూ.41.68 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా 310 మందికి రూ.3.09 కోట్లను ఇచ్చామన్నారు. వానకాలం సీజన్లో 91 11,712 మంది రైతుల నుంచి 7.51 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. గతేడాది ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు చేయించుకున్న 2,277 మందికి కేసీఆర్ కిట్ అందించినట్ల్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, పద్మజారాణి, అధికారులు పాల్గొన్నారు.