గద్వాల, జూన్ 2 : దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్ ఐపీఎస్ అనురాగ్‌శర్మ అన్నారు. రాష్ట్రంలోని సంక్షే మం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ సకల జను ల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి సీ ఎం కేసీఆర్ అని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. మొదటగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాల వేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎనిమిదేండ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను వివరించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఈ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందన్నారు. రాష్ట్రం సాధిస్తున్న విజయాలు తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వకారణమని చెప్పారు. జిల్లాలో 97 వ్యవసాయ క్లస్టర్లలో 97 రైతు వేదికలు నిర్మించామన్నారు. వంద శాతం సబ్సిడీతో 415 నీటి వనరుల చెరువుల్లో 1.50 కోట్ల చేప పిల్ల లు పెంచినట్లు వివరించారు. మత్స్యకారులకు వలలు, తెప్పలు, ద్వి, నాలుగు చక్రాల వాహనాలు 100 శాతం సబ్సిడీపై అందించామన్నారు. ర్యాలంపాడ్ రిజర్వాయర్ నుం చి గట్టు ఎత్తిపోతల పథకం, రాయపురం దగ్గర రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రభు త్వం రూ.586.06 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చిందన్నారు.
‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 161 పాఠశాలలు ఎంపిక చేశామన్నారు. జిల్లా దవాఖానలోని డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా 57 రకాల రక్త పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 4,802 మందికి కేసీఆర్ కిట్లు అందజేశామన్నారు. అర్హులైన ప్రతి పేదోడికి డబుల్ బెడ్రూం అందించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆసరా కింద 60,477 మందికి నెలా రూ.13.67 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. తొమ్మిది బ్రిడ్జి పనులను రూ.46.52 కోట్లతో ప్రారంభించి నాలుగు పూర్తి చేశామన్నారు. ఎన్నో ఆ శలు, ఆకాంక్షలతో ఏర్పడిన జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రతిఒక్కరూ కంకణబద్ధు లు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం దళితబంధు లబ్ధిదారులకు ట్రాక్టర్లు, కార్లు, దివ్యాంగ సంక్షేమ శాఖ నుంచి స్కూటీలు, ట్రైసైకిళ్లు, విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, ఆర్డీవో రా ములు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.