కోస్గి, జూన్ 1 : కోస్గి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ప్రా రంభోత్సవాలు, శంకుస్థాపనలు చే సేందుకు 4వ తేదీన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హాజరవు తు న్నారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆ యన కోరారు. బుధవారం పట్టణంలోని లక్ష్మీనర్సింహ గార్డెన్స్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ మద్దూరు, కోస్గి మండలాల ముఖ్య నాయకుల సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి పర్యటనకు ఆయా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఒక్కో గ్రామం నుంచి సుమారు వెయ్యి మంది సమావేశానికి వచ్చేలా చూడాలన్నారు. టీఆర్ఎస్ గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యేలా కృషి చేయాలన్నారు. అనంతరం మద్దూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.