నారాయణపేట టౌన్, మే 14 : అటవీ విస్తీర్ణాన్ని పెంచడంతో పర్యావరణాన్ని పరిరక్షించాలన్న సంకల్పంతో ప్రభు త్వం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్ప టి వరకు 7 విడుతల్లో నిర్వహించిన హరితహారం కార్యక్ర మం విజయవంతం అయింది. అదేవిధంగా 8వ విడుత కోసం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు…
జిల్లాలో 11 మండలాలు ఉండగా, 280 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి ప్రతి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపడుతున్నారు. ఆయా నర్సరీల్లో మొత్తం 79లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అధికారులు నర్సిరీలను సందర్శించి నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎండల తీవ్రత కారణంగా నర్సరీల్లో పె రుగుతున్న మొక్కలు ఎండిపోకుండా 85శాతం షెడ్ నెట్లు ఏర్పాటు చేశారు. అవసరమైన చోట ఏర్పాటు చేసుకోవాలని పంచాయతీ అధికారులకు సూచిస్తున్నారు. ఇప్పటికే అధికారులు మొక్కలు నాటేందుకు సైట్లను గుర్తించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు హరితహారం పకడ్బందీగా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
అటవీశాఖ ఆధ్వర్యంలో…
జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొత్తం 14 నర్సరీల ను ఏర్పాటు చేశారు. పేట మండలంలోని కొల్లంపల్లిలో 2, ఎక్లాస్‌పూర్‌లో 3, బండగొండలో 1, ఊట్కూర్ మండలంలోని బిజ్వార్లో 1, మరికల్ మండలంలోని జిన్నారంలో 2, కోస్గి మండలంలో 2, దామరగిద్ద మండలంలో 1, మక్త ల్ మండలంలో 1, మాగనూర్ మండలంలో 1 ఏర్పాటు చేశారు. నర్సరీల్లో మొత్తం 9లక్షల46వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా 9లక్షల41వేల మొక్కలను పెంచుతున్నారు.
మొక్కలు నాటే స్థలాలు…
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటాలని అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. చెరువుల ఆనకట్టలు, విద్యా సంస్థలు, ట్యాంకు బండ్ వద్ద, ఈత వనాలు, రో డ్డుకు ఇరువైపులా, పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్అండ్బీ రో డ్లు, రాష్ట్ర, అంతరాష్ట్ర రహదారులకు ఇరువైపులా రెండో వ రుసలో, బృహత్ ప్రకృతి వనాలలో, కెనాళ్ల వద్ద, ఇంటి వద్ద, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటేలని ప్రణాళికలు రూపొందించారు.
వివిధ రకాల మొక్కల పెంపకం…
నర్సరీల్లో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. ఇం టి వద్ద, రోడ్డుకు ఇరవైపులా నాటే మొక్కలతోపాటు నీడ నిచ్చే మొక్కలు, ఔషధ మొక్కలు, అలంకరణగా ఉపయోగించే మొక్కలను పెంచుతున్నారు. మల్లె, గులాబీ, చామం తి, రేగు, అంజీర్, బాదాం, చింత, జామ, కనకాంబరం, కరివేపాకు, కర్జూరం, కానుగ, కరక్కాయ, కుంకుడు, మం దారం, మోదుగ, మెహందీ, మునగ, పనస, పప్పాయ, నిమ్మ, పారిజాత, రావి, సీమచింత, శ్రీ గంధం, టేకు, తు మ్మ, తులసి, ఉసిరి, వెలగ, వేప తదితర మొక్కలు నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయి.
శాఖలకు కేటాయింపులు…
కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 30లక్షల మొక్కలు నాటే లా ప్రణాళికలు రూపొందించారు. అదేవిధంగా వివిధ శాఖ ల నుంచి మొక్కలు నాటేందుకు లక్ష్యాలను అధికారులు ని ర్దేశించారు. టీఎస్ఆర్టీసీకి 15వేలు, పేట మున్సిపాలిటీకి 15 వేలు, మక్తల్, కోస్గి మున్సిపాలిటీలకు 10వేల చొప్పున కే టాయించారు. అదేవిధంగా హార్టికల్చర్, సెరీకల్చర్ నుంచి రైతులకు 25వేలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. టీఎస్ఎస్ పీడీసీఎల్ 500, మైన్స్అండ్జియాలజీ 2000, వై ద్య ఆరోగ్యం 1000, ఆర్డబ్ల్యూఎస్ 1000, డీఐఈవో 1000, ఐసీడీఎస్ 1000, ఎనిమల్ హస్బెండరీ 2000, వెటర్నరీ 11,000, మార్కెటింగ్ 1000, మిషన్ భగీరథ 1000, పోలీస్ 300, ట్రాన్స్‌ఫోర్ట్ 300, సివిల్ సైప్లె 500, బీసీ వెల్ఫేర్ 200, ఎక్సైజ్ 50,000, ఆర్అండ్బీ 500, ట్రై బల్ వెల్ఫేర్ 500, అగ్రికల్చర్ 14,600, ఇతరములకు 10 లక్షల మొక్కలను నాటాలని నిర్దేశించారు.
యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాం
హరితహారం పకడ్బందీగా నిర్వహించేందుకు గ్రా మ పంచాయతీల్లో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాము. మండలాల వారీ గా లక్ష్యాలను నిర్దేశించాము. వ ర్షాలు కురిసిన వెంటనే గుంతలు తవ్వేందుకు ఏర్పాట్లు చేస్తున్నా ము. హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాం.
-గోపాల్‌నాయక్, డీఆర్డీవో
హరిత జిల్లాగా తీర్చిదిద్దాలి
ప్రతిఒక్కరూ విధిగా మొ క్కలు నాటి జిల్లాను హరిత జిల్లాగా తయారు చేయాలి. నాటి న ప్రతి మొక్కనూ సంరక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుం ది. నర్సరీల్లో మొక్కల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. 8వ విడుత హరితహారం విజయవంతం అయ్యేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది.
-వనజాగౌడ్, జెడ్పీ చైర్పర్సన్