తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలలో రెండు రోజుల పాటు వైన్సులు( Wines ) , బార్లు ( Bars ) బంద్ కానున్నాయి. ఈనెల 9వ తేదీ నుంచి సాయంత్రం 5 గంటల నుంచి 11 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఎన్నికల, ఆబ్కారీ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా 13వ తేదీ వరకు ఫలితాల నేపథ్యంలో వైన్స్, బార్లు బంద్ చేస్తున్నామని వివరించారు.