రాజాపూర్, ఏప్రిల్ 28 : రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి చిత్తశుద్ధి తో పని చేస్తున్నదని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ముస్లింలకు ప్ర భుత్వం తరఫున రంజాన్ తోఫాను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు రూపొందిస్తుందన్నారు.
కార్యక్రమంలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్‌నాయక్, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షు డు బచ్చిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, యూత్వింగ్ అధ్యక్షుడు వెంకటేశ్, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, నాయకులు నరహరి, ఆనంద్‌గౌడ్, సత్యయ్య, యాదగిరి, విజయ్, నర్సింహులుగౌడ్, గంగాధర్‌గౌడ్, వెంకట్‌నాయక్ పాల్గొన్నారు.