మహబూబ్‌నగర్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : డబుల్‌లైన్ పూర్తవ్వడంతో కొత్తగా రైళ్లను ప్రారంభించేందుకు సం బంధిత శాఖ సిద్ధమైంది. గతంలో తిరిగే లోక ల్ రైళ్లను కరోనా కారణంగా ఆపేసిన రైల్వే శా ఖ తిరిగి రేపటి నుంచి పునరుద్ధరించనున్నది. తొలిసారిగా మహబూబ్‌నగర్ నుంచి బోధన్ కు లోకల్ రైల్‌ను ప్రారంభిస్తున్నారు. మ రోవైపు మెదక్ జిల్లా మీర్జాపల్లికి సైతం ని త్యం ఒక లోకల్ రైలు తిరుగనున్నది. రేప టి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు క్ర మంగా ఈ లోకల్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. మొత్తం 6 లోకల్ రైళ్లు మహబూబ్‌నగర్ మీదుగా వెళ్లనున్నాయి. కొవిడ్ వల్ల లోకల్ రైళ్లు లేక ఇన్నాళ్లూ ఇబ్బంది పడిన ప్రయాణికులు ఊపిరి పీల్చుకోనున్నారు. మహబూబ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు డబుల్ లైన్ ఏర్పాటు చేయడంతో ప్రయాణ సమయం కూడా తగ్గనున్నది. అయితే, డబుల్ లైన్‌తోపాటు ఎలక్ట్రిఫికేషన్ పూర్తయినా.. కరెంట్ రైళ్లు మాత్రం ఇప్పట్లో తిరిగే అవకాశం లేదని.. అందుకు మరికొంత సమయం పడుతుందని రైల్వే శా ఖ అధికారులు చెబుతున్నారు.
గుంతకల్-కాచిగూడ మధ్య..
గతంలో గుంతకల్ నుంచి మహబూబ్‌నగర్ మీ దుగా కాచిగూడ వరకు 57426 నెంబర్‌తో.. కాచిగూ డ నుంచి గుంతకల్ వరకు 57425 నెంబర్‌తో రైళ్లు న డిచేవి. కరోనాతో రెండేళ్లుగా ఈ రైలు నిలిచిపోయింది. ఏపీ, తెలంగాణ వారికి ఈ రైలు ఎంతో సౌకర్యంగా ఉండేది. మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారా అనుకుంటున్న తరుణంలో డబుల్‌లైన్ పూర్తయిన తర్వాత రైల్వే అధికారులు ప్రయాణికులకు శుభవార్త తీసుకొచ్చారు. ఈ నెల 25 నుంచి గుంతకల్-కాచిగూడ లోకల్ రైలు ప్రారంభం కానున్నది. ఇప్పటికే గుంతకల్-డోన్ మ ధ్య నడుస్తున్న ఈ రైలును డోన్ నుంచి మహబూబ్‌నగర్ మీదుగా కాచిగూడ వరకు పొడిగిస్తున్నారు. మరోవైపు కాచిగూడ నుంచి డోన్ మీదుగా గుంతకల్‌కు ఈ నెల 28 నుంచి లోకల్ రైలు ప్రారంభం కానున్నది. ఈ రెండు రైళ్ల వల్ల కాచిగూడ-గుంతకల్ మధ్య ఉండే రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గ ద్వాల జిల్లా వాసులకు ప్రయోజనంగా మారనున్నది.
ఎలక్ట్రిఫికేషన్ పూర్తయినా..
గత నెల 29 నుంచి మహబూబ్‌నగర్-కాచిగూడ మధ్య డబుల్ లైన్ ప్రారంభమైంది. ఒకప్పుడు సింగి ల్ లైన్ వల్ల రైలు క్రాసింగులతో గంటల కొద్ది రైళ్లు నిలిచిపోయి ఇబ్బందులు పడిన ప్రయాణికులు స్వాంత న పొందుతున్నారు. డబ్లింగ్‌తోపాటు మహబూబ్‌నగ ర్ నుంచి కాచిగూడ వరకు ఎలక్ట్రిఫికేషన్ కూడా పూర్తయింది. అయితే, ఇప్పటివరకు మహబూబ్‌నగర్ నుంచే ప్రారంభమై కాచిగూడ దిశగా నడిచే రైళ్లలో కూ డా డీజిల్వే ఉంటున్నాయి. కొత్తగా ప్రారంభం అవుతున్న బోధన్-మహబూబ్‌నగర్ రైలు కూడా మొదట డీజిల్ ఇంజిన్ రైలే నడుస్తుందని అధికారులు తెలిపా రు. మహబూబ్‌నగర్-కాచిగూడ-బోధన్ మధ్య వి ద్యుద్దీకరణ పూర్తయినా.. మహబూబ్‌నగర్ స్టేషన్లో రైలు రివర్సింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియకు ఇంకా కొన్ని రోజుల సమయం పట్టనున్నది. అయితే విద్యుద్దీకరణ పనులు వేగంగా పూర్తయినా ఇంకా కరెంటు రైళ్లు తి ప్పకపోవడంపై ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా మహబూబ్‌నగర్ స్టేషన్లో పనులు పూర్తి చేసి కరెంటు రైళ్లు తిప్పాలని కోరుతున్నారు. డబ్లింగ్ పూర్తయిన తరుణంలో మహబూబ్‌నగర్-సికింద్రాబాద్ మధ్య కనీసం ఒకటో రెండో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
బోధన్-మహబూబ్‌నగర్ మధ్య..
బోధన్-మహబూబ్‌నగర్ మధ్య ఈ నెల 26 నుంచి కొత్తగా లోకల్ రైలు ప్రారంభంకానున్నది. 07275 నెంబర్‌తో నడిచే ఈ రైలు బోధన్‌లో తెల్లవారుజామున 5:20 గంటలకు ప్రారంభమై.. మహబూబ్‌నగర్‌కు మధ్యాహ్నం 1:45కు చేరుకుంటుంది. బోధన్ నుంచి మహబూబ్‌నగర్ వరకు 297 కి.మీ దూరం చేరుకునేందుకు 8 గంటల 25 నిమిషాల సమయం పడుతుంది. ఇదే రైలు కాచిగూడ వరకు వెళ్లనున్నది. 07587 నెంబర్‌తో మహబూబ్‌నగర్ నుంచి కాచిగూడకు ఈ నెల 26న రైలు ప్రారంభం అవుతుంది. మహబూబ్‌నగర్‌లో మధ్యాహ్నం 2:10 గంటలకు ప్రారంభమై కాచిగూడకు 4:30 గంటలకు చేరుకుంటుంది. బోధన్ నుంచి మహబూబ్‌నగర్‌కు వచ్చే ఈ రైలు తిరిగి కాచిగూడ వరకు మాత్రమే వెళ్లడం గమనార్హం. ఇక మహబూబ్‌నగర్ నుంచి మీర్జాపల్లికి కొత్తగా లోకల్ రైలును సైతం ప్రారంభిస్తున్నారు. 07584 నెంబర్ గల ఈ రైలు సాయంత్రం 4:10 గంటలకు బయలుదేరి మీర్జాపల్లికి రాత్రి 10:20కి చేరుకుంటుంది. 182 కి.మీ దూరాన్ని చేరుకునేందుకు 5 గంటల 10 నిమిషాల సమయం పడుతున్నది. మరోవైపు బోధన్ నుంచి మహబూబ్‌నగర్ వరకు రైలు ప్రారంభిస్తున్నా.. తిరుగు ప్రయాణంలో మహబూబ్‌నగర్ నుంచి కాచిగూడ వరకు మాత్రమే తిరగనున్నది. దీనిపైనే ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్‌నగర్ నుంచి బోధన్ వరకు ఈ రైలు తిరిగితే బాగుండేదని పేర్కొంటున్నారు.