మక్తల్ టౌన్, ఏప్రిల్ 5 : ఆడపడుచులకు అండగా సీఎం కేసీఆర్ ఉన్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నా రు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మండలంలోని ప సుపుల గ్రామానికి చెందిన ముగ్గురు, పారేవుల గ్రామానికి చెందిన ఇద్దరు, రుద్రసముద్రం గ్రామానికి చెందిన పది, పంచదేవ్‌పహాడ్ గ్రామానికి చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ఇక్కడ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ తండ్రి, అన్న, మామలాగా ఉండి ఆదుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వనజ, టీఆర్ఎస్ మండలాధ్యక్షు డు మహిపాల్‌రెడ్డి, సర్పంచ్ దత్తు, నాయకుడు శేకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఊట్కూర్, ఏప్రిల్ 5 : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం మహిళలకు వరప్రసాదమని ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఎడివెళ్లిలో కల్యాణలక్ష్మి పథకం నుంచి మంజూరైన చెక్కులను మంగళవా రం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకం కింద రూ.4 కోట్లు మంజూరయ్యాయన్నారు. నియోజకవర్గంలో 400 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకట్రామరెడ్డి, సర్పంచ్ శిరీష, ఎంపీటీసీ జయమ్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహాగౌడ్, టీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి రాం లింగం, నాయకులు నేతాజీరెడ్డి, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.