దేవరకద్ర, డిసెంబర్ 8 : మండలంలోని చిన్నరాజమూరు ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగ ణం, జాతర మైదానం కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా పుష్కరిణిలో స్నానాలు ఆచరించి స్వామి దర్శనానికి క్యూకట్టారు. సమీ ప గ్రామాల భక్తులు ఎడ్లబండ్లు, కాలినడకన చిన్నరాజమూరు అంజన్న చెంతకు చేరుకున్నారు. పలువురు భక్తులు దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బ్ర హ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యే క పూజలు నిర్వహించారు. దేవరకద్రకు చెం దిన కొండా అంజన్కుమార్రెడ్డి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
జాతర మైదానం కళకళ
చిన్నరాజమూరు ఆంజనేయస్వామి దర్శనానికి భకులు పెద్దఎత్తున తరలిరావడంతో జాతర మైదానం కళకళలాడింది. మిఠాయి, ఆటస్తువులు, గాజుల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. జాతరలో ఏర్పాటు చేసిన రంగులరాట్నం తదితర ఆటవస్తువులతో పిల్లలు ఆనందంగా గడిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్సై భగవంతురెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.