విమానంలో స్కై డిన్నర్..!
మినీ శిల్పారామంతోపాటు పెద్ద చెరువు మధ్యలో మినీ ఐలాండ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడికి చేరుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడమేకాకుండా పర్యాటకుల కో సం సెల్ఫీ పాయింట్లు నిర్మిస్తున్నారు. ఐ ల్యాండ్ మధ్యలో ఉన్న ఎత్తు ప్రదేశంలో మి నీ విమానాన్ని తీసుకొచ్చి.. బడ్జెట్ హోటల్‌ను నిర్మించనున్నారు. ఈ హోటల్లో భోజనం, స్నా క్స్ అందుబాటులో ఉంచడంతో స్కై డిన్నర్ చేసిన అనుభూతి కలగనున్నది. మరోపక్క సస్పెన్షన్ కేబుల్ బ్రిడ్జి, లేజర్ లైటింగ్లు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.
చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్డు..
పెద్ద చెరువు చుట్టూ అక్రమ కట్టడాలను తొలగించి హైదరాబాద్ త రహాలో నెక్లెస్ రోడ్డు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేర కు రూ.24 కోట్లు మంజూరయ్యాయి. దీంతో ఇటు భగీరథ కాలనీ, అటు బీ కే రెడ్డి కాలనీ, బస్టాండ్, షాషాబ్‌గుట్ట, ఇతర కాలనీ ప్రజలు నేరుగా నెక్లెస్ రోడ్డు చేరుకోనున్నారు. ఈ రహదారి జిల్లా కేంద్రానికే మణిహారంగా మారనున్నది.
మహబూబ్‌నగర్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వ లసలు, అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన పాలమూరు జిల్లా దినదినాభివృద్ధి చెందుతున్నది. పాలమూరు అంటే ఠక్కున గుర్తుకొచ్చే పిల్లలమర్రిని మించి.. జిల్లా కేంద్రంలో పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతున్నది. దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్‌తో పాలమూరు జిల్లా సరికొత్త అధ్యయనాన్ని లిఖించిం ది. విశాలమైన రహదారులు, డివైడర్లపై పచ్చని చెట్లు, జంక్షన్ల వద్ద సెల్ఫీ పాయింట్లు, మిరుమిట్లు గొలిపే హైమాస్ట్ లైటింగ్‌తో జిల్లా కేంద్రం రూ పురేఖలు మారిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ స హకారంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాలమూరులో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నాడు. మినీ శిల్పారామం పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చేనెల 4వ తేదీన సీఎం కేసీఆర్ పెద్దచెరువు వద్ద పర్యాటక ప్రదేశాలకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో మరింత పర్యాటక శోభ సంతరించుకుంటుందని పర్యావరణ ప్రేమికులు భావిస్తున్నారు.
ఆకట్టుకోనున్న మినీ శిల్పారామం..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువును మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మినీ ట్యాంక్‌బండ్‌గా రూపుదిద్దారు. పట్టణం నడిబొడ్డున ఉన్న చెరువును పర్యాటక ప్రదేశంగా మార్చాలని మంత్రి ప్ర ణాళికలు సిద్ధం చేశారు. దీంతో చెరువు చుట్టుపక్కల ఖాళీ ప్రదేశాలను సర్వే చే సి మున్సిపాలిటీ ఆధీనంలోకి తీసుకున్నారు. అనుకున్న దానికంటే ప్రభుత్వ స్థ లం అధికంగా ఉన్నది. కబ్జాకోరుల నుంచి విలువైన స్థలాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రదేశాల్లో అనేక అభివృద్ధి ప నులు చేపట్టాలని మంత్రి తలంచారు. హైదరాబాద్‌లోని శిల్పారామం తరహాలో పాలమూరులో మినీ శిల్పారామం నిర్మించేందుకు పర్యాటక శాఖ తుదిరూ పు ఇచ్చింది. చెరువు కింది భాగంలో ఆహ్లాదరకమైన వాతావరణంలో పనులు జోరందుకున్నాయి. టూరిజం శాఖ బ్లూప్రింట్కు మంత్రి తుదిరూపు ఇచ్చారు.
చెరువులో నిరంతరం కృష్ణానీళ్లు..
మహబూబ్‌నగర్ పట్టణానికి పర్యాటక శోభ సంతరించుకునేలా పెద్దచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతున్నాం. ట్యాంక్‌బండ్ పరిసరాలను ఊహించని విధంగా రూపొందిస్తున్నాం. హైదరాబాద్‌ను మించి ఉండేలా మినీ శిల్పారామాన్ని నిర్మిస్తున్నాం. లైటింగ్, గ్రీనరీ, కుర్చీలు, ఆర్చీ, విమానంలో డిన్నర్ చేసే అనుభూతి వచ్చేలా ప్లాన్ చేశాం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తికాగానే పెద్ద చెరువులో ఏడాది పొడవునా కృష్ణానది నీళ్లు ఉండేలా చర్యలు చేపడుతున్నాం. పట్టణంలోని మురుగునీటిని వెలుపలికి తరలించేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేస్తున్నాం.
– డాక్టర్ వి.శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి