జడ్చర్ల, నవంబర్ 25 : ఇండ్లులేని పేదల కలను సీ ఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అ మలుచేస్తున్నది. ఇల్లులేని అర్హులైన కుటుంబాలకు డ బుల్ బెడ్రూం ఇండ్లను అందజేయనున్నారు. డబుల్ బెడ్రూం ఇంట్లో రెండు బెడ్రూంలు, కిచెన్, హాల్, బా త్రూంలతోపాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. గత ప్ర భుత్వాల హయాంలో హౌసింగ్ పథకం ఉన్నా ఇంటి నిర్మాణాలకు చాలీచాలని డబ్బులు ఇచ్చి చేతులు దు లుపుకోవడంతో చాలామంది పేదలు ఇండ్లు నిర్మించుకోలేకపోయారు. ఇండ్లు నిర్మించుకున్న వారు అప్పులపాలయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పేదులు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు.
ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు వెచ్చించి నిర్మించారు. జడ్చర్ల నియోజకవర్గంలోని మండలాలతోపాటు జడ్చర మండలం, జడ్చర్ల మున్సిపాలిటీలో దాదాపుగా 2వేల ఇండ్లను ని ర్మించడానికి ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి మంజూరు చే యించారు. జడ్చర్ల పట్టణంలోని ఎర్రగుట్ట ప్రాంతంలో దాదాపు 560ఇండ్లను నిర్మించారు. బోయలకుంటలో 120 మంజూరు కాగా అందులో దాదాపు 96ఇండ్లు పూర్తయ్యాయి. 24ఇండ్లు ప్రారంభించలేదు. అదేవిధంగా కావేరమ్మపేటలో 120ఇండ్లు పూర్తయ్యాయి. జడ్చర్ల ఆర్అండ్బీ సమీపంలో దాదాపు 500లకు పై గా ఇండ్లు నిర్మిస్తున్నారు. హరిజన్వాడ, ఫకీర్‌నగర్, మాధవరావు కాంపౌండ్‌తోపాటు పలు గ్రామాల్లో డ బుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. అన్ని ఇండ్లు దా దాపుగా పూర్తికావచ్చాయి. కోడ్గల్ గ్రామంలో 40ఇండ్లను ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా లబ్ధిదారులకు అందజేశారు. అలాగే ఖానాపూర్‌లో, నవాబ్‌పేట మండలంలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్ల ను ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నవాబ్‌పేట మండలంలో 192, మిడ్జిల్ మండలంలో 120, బాలానగర్ మండలంలో 104, రాజాపూర్ మండలంలో 104 ఇండ్లు మంజూరు కాగా అందులో కొన్ని పూర్తయ్యా యి. మరికొన్ని వివిధ దశలో నిర్మాణంలో ఉన్నాయి. నియోజకవర్గంలో దాదాపుగా వెయ్యికి పైగా ఇండ్లు పూర్తికాగా, 400వరకు ప్రారంభం కాలేదు. మిగతావి వివిధ దశలో నిర్మాణంలో ఉన్నాయి.
అర్హుల గుర్తింపునకు అధికారుల సర్వే..
అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇ చ్చేందుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అధికారులతో ఇంటింటి సర్వే చేయించారు. సర్వేలో పూర్తిగా ఇండ్లు లేని వారినిగుర్తించి ఇం డ్లను ఇవ్వనున్నా రు. అలాగే, ఎ మ్మెల్యే ఇంటింటికీ తి రిగి అర్హులను గుర్తించడం జరుగుతుందని తెలిపారు. సర్వే పూర్తయిన తర్వాత అర్హులను గుర్తించి డబుల్ బెడ్రూం ఇండ్లను ఇవ్వనున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో దాదాపు 2వేల మంది పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు త్వరలో దక్కనున్నాయి. జడ్చర్లలో పూర్తయిన ఇండ్లను పంపిణీ చేయడానికి అధికారులు సర్వే పూర్తి చేశారు. త్వరలోనే అందరికీ ఇండ్లను పంపిణీ చేయనున్నారు.