మహబూబ్నగర్మెట్టుగడ్డ, సెప్టెంబర్ 11 : అడవు ల సంరక్షణలో అసువులు బాసిన అటవీశాఖ అమరవీరుల త్యాగం మరువలేనిదని కలెక్టర్ వెంకటారావు, ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. అటవీ అమరవీరుల సం స్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఆ యన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అటవీశాఖ అధికారి కార్యాలయంలో అటవీ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అడవుల సంరక్షణ లో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాత్రమరువలేనిదన్నారు. అనంతరం అటవీశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. అంతకుముందు ఎస్పీ వెంకటేశ్వర్లు అటవీ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రా ములు, జిల్లా అటవీశాఖ అధికారి సిరికొండ సత్యనారాయణ, ఎఫ్ఆర్వో చంద్రయ్య, అధికారులున్నారు.