మహబూబ్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 7 : విద్యార్థులు శాస్త్ర సాం కేతిక అంశాలపై ఆసక్తిని పెంచుకొని శాస్త్రవేత్తలుగా ఎదగాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. భారత అం తరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి ఐఐఆర్ఎస్ పరీక్షలో స్థానిక ప్రభుత్వ బాలు ర జూనియర్ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న ఎంఏ అక్రమ్ ప్రథమ బహుమతి సాధించి అంతర్జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. గురువారం క్యాంపు కా ర్యాలయంలో అక్రమ్‌ను మంత్రి సన్మానించి అభినందించా రు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇస్రో నిర్వహించిన పరీక్షలో అక్రమ్ ప్రతిభ చాటి అంతర్జాతీయస్థాయికి ఎంపిక కావడం జిల్లాకే గర్వకారణమన్నారు. విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయు లు, అధ్యాపకులకు సూచించారు. చదువుతోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు అబ్దుల్‌కలాం లాంటివారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ప్రిన్సిపాల్ భగవంతాచారి, జీజేఎల్ఏ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యుడు అన్వర్‌పాషా, కౌన్సిలర్ కిశోర్, అ ధ్యాపకులు శ్రీనివాస్, సతీశ్, హన్మంతరావు, వెంకటప్ప, రమేశ్, నాయకులు వినోద్, నూరుల్‌హాసన్ పాల్గొన్నారు.