దేవరకద్ర : దేవరకద్ర మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించారు. అందుకుగాను బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. మమత అనే బైపీసీ గ్రూప్ విద్యార్థి 919 మార్కులు సాధించింది. ఈమె మరికాల్ గురుకుల కాలేజీలో చదివి మండల టపర్గా నిలిచింది.
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివిన విద్యార్థిని ప్రియాంక ఎంపీసీ గ్రూప్లో 889 మార్కులు సాధించడం ద్వారా మండల టపర్ ప్లేస్ దక్కించుకుంది. ఈ సందర్భంగా వారిని జిల్లా అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఘనంగా సన్మానించారు. అంబేద్కర్ సంఘం నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దొబ్బలి ఆంజనేయులు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు.
కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శంకరాచారి, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంఈవో బలరాం, ఏవో అగర్వాల్, అంబేద్కర్ సంఘం సభ్యులు జగన్ ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.