ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ను మంజూరు చేయడంతో బీఆర్ఎస్ నేతలు సంబురాలు చేసుకున్నా రు. మంగళవారం జిల్లాకేంద్రాలు, పట్టణాలు, మండలకేంద్రాల్లో పటాకులు కాల్చి.. స్వీట్లు పంచిపెట్టారు. బీజేపీ ప్రభుత్వం ఆధారాలు లేని కేసులో ఇరికించి పైశాచిక ఆనందం పొందిందని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. కడిగిన ముత్యంలా తిరిగివచ్చిన ఎమ్మెల్సీ కవితకు అడుగడుగునా ఘనస్వాగతం పలుకుతామని వెల్లడించారు. చివరికి న్యాయమే అంతిమ విజయం సాధించిందన్నారు.
– నెట్వర్క్ మహబూబ్‌నగర్, ఆగస్టు 27
మక్తల్, ఆగస్టు 27 : ఎమ్మె ల్సీ కవిత కడిగిన ముత్యంలాగా బయటికి వచ్చేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేం ద్రానికి చెంపపెట్టు లాంటిదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన నమస్తే తెలంగాణతో ఫోన్లో మాట్లాడారు. కేసీఆర్‌ను అణగదొక్కాలనే వక్రబుద్ధితో కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితను లిక్కర్‌స్కాంలో దోషురాలిగా చూపుతూ జైలులో ఉంచడం ఎం తవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ ఆడపడుచు అయిన కవితకు స్వాగతం పలికేందుకు యావత్ ప్రజానీకం సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర ప్రభు త్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్‌ను భయపెట్టాలని చూసిందని, కానీ ఆయన ఎవరికీ భయపడే వ్యక్తి కా దన్నారు. రాష్ర్టానికి కేసీఆర్ ఒక శక్తి అని పేర్కొన్నారు. చా వునోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించిన వ్యక్తికి చెందిన కు టుంబీకులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టాలని చూడ డం తగదన్నారు. బీజేపీకి చెడురోజులు రాకతప్పదన్నారు.
నారాయణపేట, ఆగస్టు 27 : ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చే యడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఐదు నెలలపాటు అక్రమంగా జైల్లో పెట్టినా ఒక్క ఆధారం కూడా చూపెట్టలేకపోయారన్నారు. సాక్ష్యాలు లేకుండా ఆరోపించిన నేర ఆదాయాన్ని రికవరీ చేయకుండా.. కేవలం ఆమోదించే వారి ప్రకటనలు, అంచనాల ఆధారంగా అరెస్ట్ చేయడం చూస్తుంటే రాజకీయ ప్రతీకార చర్య తప్పా మరొకటి కాదన్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.
కొల్లాపూర్, ఆగస్టు 27 : న్యాయస్థానం ఎదుట ఎమ్మె ల్సీ కవితపై పెట్టిన అక్రమ కేసులు నిలవలేవని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం హర్షణీయమన్నారు. అక్రమ కేసులో ఆధారాలు లేకుండా అరెస్టు చేసి జైలుకు తరలించారన్నారు. చివరికి న్యాయమే గెలిచిందన్నారు. కొత్త ఉత్తేజంతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.