మహబూబ్‌నగర్, మార్చి 28 : మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. ప్రధాన ఎన్నికల అధికారి కొండయ్య నేతృత్వంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగిం ది. మొత్తం 424 మంది ఓటర్లు ఉండగా అందులో 379 వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
4గంటల అనంతరం కౌంటింగ్ నిర్వహించగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అనంతరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్‌రావు, సంయుక్త కార్యదర్శిగా నాగోజీ, ఉపాధ్యక్షుడిగా వెంకటయ్య, కోశాధికారిగా వెంకట్రావు, లైబ్రేరియన్‌గా రాజుతోపాటు పది మంది సభ్యులు గెలుపొందా రు. వీరికి సీనియర్ న్యాయవాదులు అభినందించారు.