e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home జిల్లాలు అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దు

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దు

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దు

అందరి సంక్షేమానికి కృషి
సురవరం అందరికీ ఆదర్శం : ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌, మే 28 : ప్రతి ఒక్కరి సంక్షేమం కో సం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మాడ్రన్‌ హైస్కూల్‌లో జర్నలిస్టులకు, సూపర్‌ స్ప్రెడర్లకు ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తున్నదన్నారు. జిల్లాలో జర్నలిస్టులకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇటీవల దుబాయిలో కరోనాతో మరణించిన అహ్మద్‌ య హ్య భార్య అతీక్‌ అంజామ్‌కు రూ.6,07,560, అతవుర్‌ రహమాన్‌ భార్య సైరా తబస్సుమ్‌కు రూ.2,39,152 చె క్కును ఇండియన్‌ ఎంబసీ సమకూర్చగా, అట్టి చెక్కులను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌పవర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ గణేశ్‌, డీఎంహెచ్‌వో కృష్ణ, డీపీఆర్‌వో వెంకటేశ్వర్లు, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ నటరాజ్‌, తిరుపతిరావు, డాక్టర్‌ ఖాజా పాల్గొన్నారు.
తాగునీటి ఇబ్బందుల్లేకుండా చర్యలు..
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సంబంధిత అధికారులతో స మీక్ష నిర్వహించారు. పట్టణాన్ని రెండు జోన్లుగా విభజిం చి.. ఒక రోజు ఒక జోన్‌కు.. మరుసటి రోజు మరో జో న్‌కు తాగునీటి సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించామని మిషన్‌ భగీరథ ఇంజినీరింగ్‌ అధికారులు మం త్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ గ్రామాల్లోనూ ఇబ్బందుల్లేకుండా తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. జిల్లా దవాఖాన అభివృద్ధిలో భాగంగా సుందరీకరణ కార్యక్రమాలు చేపట్టాలని, నాణ్యతతో కూడిన క్యాంటిన్‌ ఏర్పాటు చేయాలని తెలిపారు. గేట్లను ఆధునికీకరించాలని, రోగుల సహాయకులు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. దవాఖాన ప్రహరీకి మంచి పెయింటింగ్‌ వేయించాలని, బస్తీ దవాఖానల ద్వారా నిరంతరం సేవలందించేందుకు సి బ్బందిని నియమించాలన్నారు. మూడో విడుత ఫీవర్‌ స ర్వేను ప్రారంభించాలన్నారు. డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని హౌసింగ్‌ ఈఈ భాస్కర్‌ను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌పవార్‌, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ వెంకటరమణ, డీఎంహెచ్‌వో కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సురవరం అందరికీ ఆదర్శం..
సురవరం ప్రతాపరెడ్డి సేవలు చిరస్మరణీయమని మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని గ్రీన్‌బెల్ట్‌ లో సురవరం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సురవరం చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్‌ తదితర ప్రాంతాల్లో ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి లాక్‌డౌన్‌ అమలుతీరును పర్యవేక్షించారు.
క్రీడాభివృద్ధికి కృషి..
మహబూబ్‌నగర్‌ టౌన్‌, మే 28 : క్రీడాభివృద్ధికి ప్రభు త్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మహబూబ్‌నగర్‌ స్టేడియం మైదానంలో శుక్రవారం వాకింగ్‌ ట్రాక్‌, వాలీబాల్‌ మైదానం పనులకు పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.2.50 కోట్లతో స్టేడియం సుందరీకరణ పనులు చేపడుతున్నామన్నారు. త్వరలో ఇండోర్‌ స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో శ్రీనివాసులు, కౌన్సిలర్‌ రామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దు

ట్రెండింగ్‌

Advertisement