భూత్పూర్, అక్టోబర్ 31 : ప్రభుత్వ వైఫల్యాలే జూబ్లీహిల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపునకు సోపానాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్‌నగర్ డివిజన్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఓటర్లే ప్రభుత్వం ఇస్తానన్న ఆరు గ్యారెంటీలను గాలికి వదిలేసి, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకొనే నాథుడే లేడని అంటున్నట్లు ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో మంచి మద్దతు ఉన్నట్లు తెలిపారు. మాగంటి సునీత గెలుపుబాటలో పయనిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భూత్పూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, మాజీ సర్పంచులు సత్తూర్ నారాయణగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, కౌకుంట్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలచందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అలంపూర్, అక్టోబర్ 31 : జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న మాగంటి సునీతకు మద్దతుగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు శుక్రవారం ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జూబ్లీహిల్స్ ప్రజలకు బీఆర్ఎస్ హయాంలో చేసిన అభవృద్ధి పనులను వివరించి ఓటు అభ్యర్థించారు. అనంతరం బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన సెంటర్ ఫర్ దళిత్ స్టడీ సెంటర్‌ను సందర్శించి మీడియాతో మాట్లాడారు.