జోగులాంబ గద్వాల : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఆటోను లారీ ఢీ కొన్న ఘటనలో ఇద్దరుయువకులు ( Two Youth Died ) అక్కడికక్కడే మృతి చెందారు. వడ్డేపల్లి మండలం జులకల్ సరిహద్దు వద్ద టమాట బాక్సులతో శాంతినగర్‌కు వెళుతున్న ఆటోను అతి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో మహేష్ (19), విశ్వాస్ (18) అనే ఇద్దరు యువకుడు మృతి చెందారు. మృతులు పచ్చర్ల గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.