lorry drivers Protest| మరికల్ మండలంలోని చిత్తనూర్ గ్రామ సమీపంలోని జూరాల ఆగ్రో ఇథనాల్ కంపెనీ దగ్గర ఇవాళ లారీ డ్రైవర్లు ఆందోళన చేశారు. జొన్నలు, నూకలు, బియ్యం, మొక్కజొన్నలను గుంటూరు, తెనాలి తదితర ప్రాంతాల నుండి లారీల ద్వారా చిత్తనూరు ఇథనాల్ కంపెనీకి తీసుకురాగా ఇక్కడ కంపెనీ యాజమాన్యం లారీలను అన్లోడ్ చేసుకోవడం లేదని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరు రోజులుగా కంపెనీ దగ్గర ఉండడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు లారీ డ్రైవర్లు విలేకరులకు తెలిపారు. డ్రైవర్లకు సరైన వసతులు లేకపోవడంతోపాటు తాగేందుకు నీరు, తినేందుకు అన్నం కూడా లేని పరిస్థితి ఏర్పడిందని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే లారీలు బారులు తీరాయని ఎప్పటికప్పుడు ధాన్యాన్ని అన్లోడ్ చేసుకుంటే వెయిటింగ్ సమస్య ఉండదని వారు వాపోయారు.
అన్నం వండుకోవడానికి రెండు కిలోమీటర్లు నడిచి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. వారం రోజులుగా ఇక్కడే ఉండటం వల్ల గ్యాస్ లేక తిండి లేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. లారీలో ధాన్యాన్ని అన్లోడ్ చేయాలని కంపెనీ యాజమాన్యాన్ని బతిమిలాడినా వారిని పట్టించుకోవడంలేదని లారీ డ్రైవర్లు విమర్శించారు. ధాన్యం వద్దని లెటర్లు ఇస్తే వెళ్తామని చెప్పినా లెటర్లు ఇవ్వక, ధాన్యం అన్లోడ్ చేసుకోక డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
ఈ విషయమై కంపెనీ యాజమాన్యంతో విలేకరులు మాట్లాడగా.. కంపెనీకి సరిపడా ధాన్యం ఉండడంతో ధాన్యం కాంట్రాక్టుకు వద్దని చెప్పినా వినకుండా లారీలు పంపించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. డ్రైవర్లకు కనీస వసతులైన మరుగుదొడ్లు, త్రాగునీరు, భోజనం వ్యవస్థ, విశ్రాంతి గదులు లేకపోవడంతో ఎండలోనే కాలం గడిపే పరిస్థితి ఏర్పడిందన్నారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఇబ్బంది పడటమే కాకుండా తిండి లేక నీరు లేక ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
BRS : కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండ : రావులపల్లి రాంప్రసాద్
TTD | టీటీడీకి తిరుమల విద్యా సంస్థల చైర్మన్ భారీ విరాళం
Road Accident | సికింద్రాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి