గద్వాల, జూలై 30 : ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి జూరాలకు భారీగా వరద వస్తున్నది. మంగళవారం జూరాలకు 2.90 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో 39 గేట్లు ఎత్తి 2,62,179 క్యూసెక్కులను విడుదల చేశారు. జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీ లు కాగా.. ప్రస్తుతం 8.434 టీఎంసీలుగా ఉన్న ది. జూరాల నుంచి విద్యుదుత్పత్తికి 19,698, నెట్టెంపాడు లిఫ్ట్‌కు 750, భీమా లిఫ్ట్-1కు 650, భీమా లిఫ్ట్-2కు 750, జూరాల ఎడమ కాల్వకు 820, కుడి కాల్వకు 658, కోయిల్‌సాగర్‌కు 315, సమాంతర కాల్వకు 900 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు నుంచి 2,86,115 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.
అయిజ, జూలై 30 : టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 52,028, అవుట్‌ఫ్లో 61,636 క్యూసెక్కులుగా నమోదైంది. 105.788 టీఎంసీల గరిష్ఠ నీటి ని ల్వకుగానూ ప్రస్తుతం 101.734 టీఎంసీలు నీటి నిల్వ ఉన్నది. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 83,016, అవుట్‌ఫ్లో 82,453 క్యూసెక్కులుగా ఉన్నది. ఆయకట్టుకు 563 క్యూసెక్కులను విడుదల చేశారు. ప్రస్తుతం ఆనకట్టలో 12.3 అడుగుల మేరకు నీటి మట్టం ఉన్నది.
ఆల్మట్టి ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 3 లక్షలు, అవుట్ ఫ్లో 3.50 లక్షల క్యూసెక్కులుగా ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 129.72 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 67.967 టీఎంసీలుగా ఉన్నది. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 3.25 లక్షలు, అవుట్‌ఫ్లో 3.50 లక్షల క్యూసెక్కులుగా ఉన్నది. గరిష్ఠస్థాయి నీటి నిల్వ 37.64 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 23.769 టీఎంసీలు ఉన్నది.
శ్రీశైలం, జూలై 26 : శ్రీశైలం జలాశయానికి వరద అంతకంతకూ పెరుగుతున్నది. శ్రీశైలం డ్యాంలో రాత్రికి 4,13,178 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో పది గేట్లను ఎత్తి వరదను నా గార్జునసాగర్కు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా.. ప్ర స్తుతం 209.5948 టీఎంసీలు నిల్వ ఉన్నది. కు డిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 21,432, ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 35, 315 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. దీం తో ప్రాజెక్టు గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి 3,32,447 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.
ఆత్మకూరు, జూలై 30 : ఎగువ, దిగువ జూ రాల జలవిద్యుత్ కేంద్రాల్లోని ఐదు యూనిట్లలోనే విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో నాలుగు రోజులుగా ఉత్పత్తి నిలిచిపోగా, ఎగువ జూరాలలో మాత్రం 5 యూనిట్లలో ఉత్పత్తి కొనసాగుతున్న ది. సోమవారం అర్ధరాత్రి వరకు 2.072 మి. యూ ఉత్పత్తి జరుగగా మొత్తంగా 33.390 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. దిగువ జూరాలలో విద్యుదుత్పత్తి నిలిచిపోయిన పరిస్థితుల్లో ఇప్పటి వరకు 32.995 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం తగ్గుముఖం పడితేనే దిగువ జూరాలలో ఉత్పత్తి సాధ్యపడుతుందని ఎస్ఈ కల్లూరి రామసుబ్బారెడ్డి తెలిపారు.