గద్వాల, జూలై 28 : ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతుండడంతో కృష్ణ మ్మ ఉప్పొంగి ఉరకలేస్తున్నది. ఆదివారం ఎ గువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి జూరాల ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు కాగా.. 41 గేట్లు ఎత్తి దిగువకు 2,75,538 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జూరాలలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.
ఆనకట్ట గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం వైపు పరుగెడుతున్నది. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318. 516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.670 మీ టర్లు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.971 టీఎంసీలుగా న మోదైంది. జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తికి 18,922, నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 750, భీమా లిఫ్ట్‌కు-1కు 1,300, భీమా లిఫ్ట్-2కు 750, జూరాల ఎడమ కాల్వకు 820, కుడి కాల్వకు 578, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కులను విడుదల చే స్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు నుంచి 2,98,866 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.
అయిజ, జూలై 28 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు 1,46,268 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 33 గేట్లను ఎ త్తారు. 105.788 టీఎంసీల సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్ర స్తుతం 97.715 టీఎంసీల నిల్వ ఉన్నది. 1633 అడుగులకు గానూ 1630.96 అడుగులు ఉన్నట్లు ఎస్ఈ శ్రీకాంత్‌రెడ్డి, సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.
కర్ణాటకలోని టీబీ డ్యాం నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో ఆర్డీఎస్ జలకళను సంతరించుకున్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు 1,30,000 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో 1,29,350 క్యూసెక్కుల వరద నీరు సుంకేసుల బ్యారేజీకి చేరుతోంది. అదేవిధంగా ఆయకట్టుకు 650 క్యూసెక్కులు వి డుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 13.8 అడుగుల నీటిమట్టం ఉంది.
కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 2,68,222 క్యూసెక్కులు చేరుతుండగా, అవుట్‌ఫ్లో 3,25,000 క్యూ సెక్కులుగా ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 69.664 టీఎంసీలు ఉన్నది. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 3,20,000 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 3,27,366 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రస్తుతం 24.489 టీఎంసీలుగా ఉన్నది.
రాజోళి, జూలై 28 : మండలంలోని సుంకేసుల డ్యాంకు ఆదివారం సాయంత్రం వరకు 1,49, 300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా.. 28 గేట్లు ఎత్తి 1,46,760 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ రాజు తెలిపారు. డ్యాం నీటి సామర్థ్యం 1.23 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 0.438 నీటి నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కేసీ కెనాల్‌కు 1540 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
శ్రీశైలం, జూలై 28 : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తుండడంతో మంగళవారం గేట్లు ఎత్తేందుకు అధికారులు నిర్ణయించారు. అయితే, ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 3,73,942 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. పూర్తి స్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 159.7646 టీఎంసీలుగా ఉన్నది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ 61,038 క్యూసెక్కులను దిగువ కు విడుదల చేస్తున్నారు. వరద ఇలాగే కొనసాగితే రేపు రాత్రికి శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయిలో నిండనున్నది.