పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో మహబూబ్‌నగర్‌లోని చెరువులన్నీ నింపి, ప్రతి ఇంచు భూమిని సస్యశ్యామలం చేస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం హన్వాడ మండలంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గతంలో ప్రభుత్వాలు నీటిని ఒడిసి పట్టులేకపోవడంతో ఈ ప్రాంతం ఎడారిగా మారిందన్నారు. స్వరాష్ట్రంలో చెక్ డ్యాంలు నిర్మించడంతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు.
హన్వాడ, జూలై 21 : పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని చెరువులన్నీ నింపి వాగులపై చెక్ డ్యాంలను నిర్మించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే ధ్యేయమని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శా ఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువా రం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలో సు డిగాలి పర్యటన చేపట్టారు. రూ. 16.16 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వేపూరు గ్రామ శివారులో రూ. 2.89 లక్షల వ్యయంతో నిర్మించిన చెక్ డ్యాంను ప్రారంభించిన అ నంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో రాష్ర్టాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు నీటిని ఒడిసి పట్టుకోకపోవడం, భూగర్భ జలాల పెంపుపై దృష్టి సారించకపోవడంతో ఎలాంటి చెక్‌డ్యాంలు నిర్మించలేదన్నారు. అం దుకే మహబూబ్‌నగర్ జిల్లా ఎడారిగా మారిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మించిన చెక్‌డ్యాంల వల్ల భూగ ర్భ జలాలు పెరిగాయని.. చుట్టుపక్కల బావులు, బోర్లలో నీటిమట్టం పెరిగిందని, రైతులు సంతోషంగా పంటలు సాగు చేసుకుంటున్నారన్నారు. జిల్లాలో చేపట్టిన చెక్‌డ్యాంల నిర్మాణం కారణంగా జాతీయస్థాయి లో జిల్లాకు స్కోచ్ అవార్డులు వచ్చాయని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద కర్వెన రిజర్వాయర్ ద్వారా నియోజకవర్గంలోని అన్ని చెరువులను నీటితో నింపుతూ, దా రిలో ఉన్న వాగులన్నింటిపై చెక్ డ్యాంలు నిర్మాణం చేపట్టి ప్రతి ఇంచు భూమికి నీటిని అందజేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. ప్రభు త్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, సాగునీటి సౌకర్యాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నదని, భవిష్యత్తులో తెలంగాణ అంటే వ్యవసాయం అనే రీతిగా తీర్చిదిద్దుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, పాల ఉత్పత్తులపై కూడా జీఎస్టీ విధించడం అన్యాయమన్నారు. ఎప్పటికప్పుడు వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం, పెట్రోల్ గ్యాస్ వంటి వాటిపై జీఎస్టీ విధించి ధరల పెరుగుదలకు కారణమవుతున్నదన్నారు. అంతకుముందు హన్వాడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. మన ఊరు మన బడి కింద చేపట్టిన పనులు నాణ్యతతో చేయాలని లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు.
శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు..
హన్వాడ మండలకేంద్రంలో రూ.4.90 లక్షలతో జెడ్పీ హైస్కూల్ ఆవరణలో నిర్మించిన క్రీడా ప్రాంగణాన్ని మంత్రి ప్రారంభించారు. హన్వాడ క్రీడా ప్రాం గణం వద్ద గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులు, ఆశ వర్కర్లకు హైజీనిక్ కిట్లను, చెంచులకు టార్పాలిన్లు పంపిణీ చేశారు. మండలంలోని రామన్నపల్లిలో రూ. 50.22 లక్షలతో ‘మన ఊరు -మన బడి’ పనులకు భూమిపూజ, రూ.16లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, రూ.34.75 లక్షలతో నిర్మించిన 60 కేఎల్ఓవర్ హెడ్‌వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించారు. వేపూర్‌లో రూ. 2.89 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాంను ప్రారంభించారు. జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో రూ.58.35 లక్షలతో ‘మన ఊరు-మనబడి’ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం లింగన్నపల్లి గ్రామంలో రూ.49.46 లక్షలతో మ న ఊరు మనబడి పనులకు భూమి పూజ చేశారు. ము నిమోక్షం గ్రామంలో రూ.8.92 కోట్లతో చేపడుతున్న వాటర్ షెడ్ పనులను ప్రారంభించేందుకు పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం రూ.1.69 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్, రూ.16 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, రూ.10 లక్షలతో నిర్మించి న సీసీ రోడ్డు, రూ.66.90లక్షలతో నిర్మించిన 90 కేఎల్ ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ విజయనిర్మల, డీఆర్డీవో యాదయ్య, ఎంపీపీ బాలరాజు, జెడ్పీ కో-ఆప్షన్ సభ్యు డు అన్వర్, మండల కో-ఆప్షన్ సభ్యుడు మన్నాన్, వైస్ ఎంపీపీ లక్ష్మి, విండో చైర్మన్, వైస్ చైర్మన్ వెంకటయ్య, కృష్ణయ్యగౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాజుయాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ కొండా లక్ష్మయ్య, ఎంపీడీ వో ధనుంజయగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, ఏపీఎం సుదర్శన్, ఏవో కిరణ్‌కుమార్, ఈవోపీఆర్డీ వెంకట్‌రెడ్డి, భగీరథ ఏఈ యాదయ్య, సర్పంచులు రేవతి, స త్యమ్మ, రాములమ్మ, ఎంపీటీసీలు శేఖర్, వెంకట్రాములు, భాగ్యమ్మ, సత్యమ్మ, నాయకులు రమణారెడ్డి, చెన్నయ్య, కృష్ణార్జున్, బాలయ్య, జంబులయ్య, ఆంజనేయులు, బసిరెడ్డి, పాపయ్య, సుక్కయ్య, యాదయ్య, ఖాజాగౌడ్, సత్యం, శ్రీనివాసులు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి పరామర్శ..
ఈ నెల 15వ తేదీన మండలంలోని వేపూర్ గ్రామానికి చెందిన రాఘవేందర్‌రెడ్డి (33) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గురువారం మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. రాఘవేందర్‌రెడ్డి భార్య గర్భిణీ కావడంతో ఆమెను దవాఖానలో చేర్పించారు. ఇల్లు శిథిలావస్థలో ఉండడంతో.. డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయిస్తామని తెలిపారు.