భూత్పూర్, ఫిబ్రవరి 8 : మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా భూత్పూర్ మున్సిపాలిటీ లో 10, 4, 9వ వారుల్లో ఆయన విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, కేసీఆర్ నామజపంతో కాలయాపన చేస్తున్నారన్నారు.
కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ.4వేల పింఛన్, రైతులకు సరిపడా యూరియా ఇస్తేనే కాంగ్రెస్‌కు ఓటువేయాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలకు లొంగకుండా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే భూత్పూర్ మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన గుర్తుచేశారు.
కార్యక్రమంలో ఇన్చార్జి వాల్యానాయక్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, అభ్యర్థులు కడప పద్మజ, గడ్డం ప్రేమ్‌కుమార్, సంధ్య, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్, సర్పంచులు ఆల శ్రీకాంత్‌రెడ్డి, సురేశ్, మాజీ సర్పంచ్ సత్తూర్ నారాయణగౌడ్, నాయకులు మురళీధర్‌గౌడ్, అశోక్‌గౌడ్, సదానంద్‌గౌడ్, గడ్డం రాములు, సాధిక్, నర్సిములు, వెంకటయ్య, యాసీన్, ఫసియొద్దీన్, నర్సింహారెడ్డి, చెన్నయ్య పాల్గొన్నారు.