జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 18 : బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీన పల్లెపల్లెలో గులాబీ జెండా ఎగరాలని, అనంతరం 27వ తేదీన వరంగల్‌లో నిర్వహించే జరతోత్సవ సభకు భారీగా తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్య నాయకులతో శుక్రవారం తిరుమలహిల్స్‌లోని తన నివాసంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ముందస్తుగా 26న నియోజకవర్గంలోని అన్ని గ్రామాలతోపాటు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో పార్టీ జెండాను ఎగరవేయాలన్నారు.
పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పుట్టిన బీఆర్ఎస్ రాష్ర్టాన్ని సాధించటంతోపాటు కేసీఆర్ నేతృత్వంలో దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా పదేండ్ల పాలనలో తీర్చిదిద్దడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభకు అన్ని గ్రామాల నుంచి పెద్దఎత్తున గులాబీశ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత, మాజీ జెడ్పీవైస్‌చైర్మన్ యాదయ్య, పట్టణ అధ్యక్షుడు మురళి, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నవాబ్‌పేట, ఏప్రిల్ 18 : వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించతలపెట్టిన రజతోత్సవ సభకు మండ లంలోని గులాబీ శ్రేణులు భారీగా తరలిరావాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని చెన్నారెడ్డిపల్లిలో శుక్రవారం వేడు కలకు సంబంధించిన వాల్‌రైటింగ్‌ను ఆయన ప్రారంభించారు. వరంగల్‌లోని ఎల్కతుర్తి వద్ద నిర్వహించే సభకు గడప గడప నుంచి తరలిరావాలన్నారు. కార్యక్రమంలో
బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సిం హులు, మాజీ మార్కెట్ చైర్మన్ లక్ష్మయ్య, నాయకులు యాదయ్యయాదవ్, యాదయ్య, చెన్నయ్య, ప్రతాప్, ప్రణీల్‌చందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి, ఏప్రిల్ 18 : బీఆర్ఎస్ 25వసంతాల రజతోత్సవ సభకు పండుగలా ప్రజలు తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్యా దవ్ పిలుపునిచ్చారు. కల్వకుర్తిలో శుక్రవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్
రజత్సోవ సభకు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ శ్రేణులను, పార్టీ అభిమానులను తరలించేందుకు ఏర్పాట్లపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
గ్రామాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండ లానికి 5బస్సులు ఏర్పాటు చేశామని, జెండాలు, బ్యానర్లు అందుబాటులో ఉన్నాయని, ఈనెల 27 ఉదయం ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగర వేయాలని చెప్పారు. సభకు రావడానికి సామాన్య ప్రజలు కూడా ఉవ్విళ్లూరుతున్నారని, వారిని సభకు జాగ్రత్తగా తరలించి, మళ్లీ తీసుకొచ్చే బాధ్యతపై మనందరిపై ఉందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విజయ్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్, బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్, మనోహర్‌రెడ్డి, వెంకటేశ్వర్రావు, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.