ఊట్కూర్, ఫిబ్రవరి 28 : నారాణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం కోసం చేపట్టిన భూ సేకరణ సర్వేను రైతులు అడుగడుగునా అడ్డుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కర్మంలో శుక్రవా రం ఊట్కూర్ మండలంలోని జీర్ణహల్లి, దంతన్‌పల్లి శివారులో అధికారులు భూ సేకరణ కోసం నిర్వహించిన సర్వేను రైతులు అడ్డుకున్నా రు. సర్వేలో పాల్గొన్న తాసీల్దార్ చింత రవితో రైతులు వాదినకు ది గా రు. తమ పొలాల్లో ఓపెన్ కెనాల్ ఏర్పాటు చేస్తే ఉన్న కొద్దిపాటి భూ ములను కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని రైతులు అధికారుల ఎదుట తమ గోడును వెల్లబోసుకున్నారు.
రైతులకు మద్దుతుగా బీఆర్ఎస్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మండల యువజన అధ్యక్షుడు ఆనంద్‌రెడ్డి, ఒబేదుర్ రెహమాన్, తరుణ్‌రెడ్డి, బీజేపీ నాయకులు భా స్కర్, భరత్, హన్మంతులు రైతులకు మద్దతుగా నిలిస్తూ దంతన్‌పల్లి శివారులో ప్రధాన రహదారి పక్కన వ్యవసాయ పొలాలు ప్రస్తుతం ఎకరం రూ.50 లక్షల పైమాటే ఉందని, ప్రాజెక్టు నిర్మాణంలో భూ ములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఏ విధమైన సహాయం అందిస్తుందో సమావేశం నిర్వహించాలని అధికారులతో వాదించారు.
పోలీసులను అడ్డుపెట్టి బలవంతంగా సర్వే నిర్వహించడం ప్రభుత్వానికి తగదన్నారు. ప్రభుత్వం రైతులకు తగిన పరిహారం అందించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల భూ సేకరణ సర్వేకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత కొనసాగుతుండటంతో ముం దస్తు జాగ్రత్తగా అధికారులు పోలీసు బలగాలను అడ్డం పెట్టి సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే సందర్భంగా తెల్లారిందే మొదలు రైతుల పొలాల్లో పోలీసులు మోహరిస్తున్నారు.
ఊట్కూర్ మండలం జీర్ణహల్లి, దంతన్‌పల్లి శివారులో మక్తల్, మాగనూర్, ఊట్కూర్ ఎస్సైలు భాగ్యలక్ష్మీరెడ్డి, అశోక్‌బాబు, కృష్ణంరాజు ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మొహరించారు. పచ్చని పొలాల్లో పోలీసుల బూట్ల చప్పుళ్లకు రైతులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ పొలాల్లో అధికారులు బలవంతంగా సర్వే నిర్వహిస్తున్నప్పటికీ కేసులకు భయపడాల్సి వస్తోందని బాధిత రై తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల లగచర్ల గిరిజన రైతులపై జరిగిన దమన కాండను వారు స్వయంగా గుర్తు చేస్తున్నారు.