మాగనూరు కృష్ణ : మాగనూరు కృష్ణా ఉమ్మడి మండలాల్లోని పలు గ్రామాల్లో జాతర (Jatara) , రథోత్సవ కార్యక్రమాలు ఆదివారం వైభవంగా కొనసాగాయి. గుండెబల్లూరు స్వయంభు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి (Lakshmi Venkateswara Swamy ) జాతర మహోత్సవ సందర్భంగా నిర్వహించిన రథోత్సవ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి లక్ష్మీ ( MLA Srihari Laxmi) , మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Rammohan Reddy) తదితరులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వర్కూరు గురురావలింగంపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి జాతరలో వారు పాల్గొని ఆంజనేయ స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ,మాజీ ఎమ్మెల్యేకు గ్రామస్థులు శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో మాగనూరు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి , మక్తల్ మాజీ మార్కెట్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి , మాజీ సర్పంచులు హనుమంత్, డాక్టర్ మణికంఠ గౌడ్, ఆంజనేయులు గౌడ్, మల్రెడ్డి, మారెప్ప, శివ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, రజనీకాంత్, నాయకులు లక్ష్మారెడ్డి, కట్ట సురేష్, రాజప్ప గౌడ్, ఆనంద్ గౌడ్, నాగేందర్, ఆనంద్, హేమ సుందర్, ఆనంద్, నాగరాజ్, తదితరులు పాల్గొన్నారు.