ఊట్కూర్ : విద్యా రంగానికి పీఆర్టీయూ ( PRTU ) మాజీ జిల్లా గౌరవ అధ్యక్షుడు, స్వర్గీయ యం.లక్ష్మారెడ్డి (Lakshma Reddy) సేవలు చిరస్మరణీయమని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు యాదగిరి జనార్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో లక్ష్మారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా పీఆర్టీయూ టీఎస్ ఊట్కూర్ మండల శాఖ, 1988 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో తల్లిదండ్రులు లేని 250 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం ఉపాధ్యాయ సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిని పవిత్రంగా భావిస్తూ ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడుతూనే మరోపక్క ప్రభుత్వ బడుల బలోపేతానికి, విద్యాభివృద్ధికి లక్ష్మారెడ్డి కృషి చేసేవారని కొనియాడారు.
రెండు దశాబ్దాల కాలం పాటు ఉపాధ్యాయులకు సేవ చేసి అకాల మరణం చెందటం విద్యారంగానికి తీరనిలోటని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మణెమ్మ, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు తిరుపతి, ఊట్కూరు మండల ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు రఘువీర్, సత్యనారాయణ రెడ్డి, బలరాం, తిమ్మన్న, శ్రీనివాసు, జీహెచ్ఎంలు కుసుమ, గౌరమ్మ, చంద్రశేఖర్ రెడ్డి, నాగం శేఖర్ రెడ్డి, సత్యపాల్, గురునాథ్, భాస్కర్, పూర్వ విద్యార్థులు గోపాల్ గౌడ్, రాజగోపాల్, బి. రవి, జయశ్రీ, మహమ్మద్ రఫీ, ప్రతాప్ రెడ్డి, నారాయణ, వసుంధర, సుజాత తదితరులు పాల్గొన్నారు.