రైతుల్లో ఎల్నినో ఆందోళన.. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. దీంతో పూర్తిస్థాయిలో వర్షాలు కురిసిన తర్వాతే పంటలు సాగు చేసుకోవాలని మరోవైపు వ్యవసాయాధికారులు చెబుతుండడంతో రైతులు మ రింత ఆందోళన చెందుతున్నారు. ఎల్నినో ప్రభావంతోనే వర్షాలు కురవడం లేదని అన్నదాతల్లో ఆందోళన తప్పడం లేదు.
నాగర్కర్నూల్, జూన్ 12 : రుతుపవనాలు తెల ంగాణను తాకినా నాగర్కర్నూల్ జిల్లాలో మా త్రం ఇంకా వర్షాలు కురవడం లేదు. మృగశిర కార్తె ప్రారంభమై వారం రోజులు గడిచిపోయింది. ఇప్పటికే జిల్లాను రుతుపవనాలు తాకి వర్షాలు కురవాల్సి ఉండగా వరుణు డు కరుణించడం లేదు. వేసవి ముగిసి వానకాలం ప్రారంభం కావడంతో ఇప్పటికే రైతులు జిల్లాలో తమ పంట పొ లాలు దున్ని చదును చేసుకొని సా గుకు సిద్ధం చేసుకున్నారు. తెలంగాణలోకి నైరుతి రుతుపవనా లు జూన్ 8వ తేదీన జోగుళాంబ గద్వాల జిల్లా మీ దుగా ప్రవేశించి రెం డు రోజుల్లో రా ష్ట్రం అంతటా విస్తరించినప్పటికీ నాగర్కర్నూల్ జిల్లాలో మాత్రం రైతన్నలు వరుణుడికోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.
వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసినా నాగర్కర్నూల్లో మాత్రం ఎలా ంటి వర్షాలు కురవకపోగా ఎండ తీవ్రత తగ్గడం లేదు. రుతుపవనాలు వచ్చినా వానలు ఆశించిన స్థాయిలో పడకపోవడానికి వాతావరణ వ్య వస్తలు బలహీనంగా ఉండడమే కారణంగా తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు బలంగా ఉంటే నే వర్షాలు విస్తారంగా కురుస్తాయని, ప్రస్తుతం అవి బలహీనంగా ఉండడం లేదా దిశ మార్చుకోవడంతోనే నాగర్కర్నూల్ ప్రాంతం లో వర్షా లు కురవడం లేదని తెలుస్తోంది. మృగశిర కార్తె లో వర్షాలు కురుస్తాయన్న ఆశతో ఇప్పటికే చా లా మంది రైతులు అడపా దడపా కురిసిన వర్షాలకు, బోరుబావుల నీటితో నేలను తడిపిన జి ల్లాలోని బిజినేపల్లి, తాడూరు, తెలకపల్లి, నాగర్కర్నూల్ ప్రాంతాల్లోని రైతులు పత్తి విత్తనాల ను సాగు చేసి పరేషాన్లో పడ్డారు. రెండు రోజు ల్లో వర్షాలు కురవకపోతే విత్తనాలు నేలపాలయ్యే అవకాశం లేకపోలేదు.
నాగర్కర్నూల్ జిల్లాలో 6,87,215 ఎకరాలు సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయాధికారులు ఈ వానకాలం కోసం వేసిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశా రు. అత్యధికంగా పత్తి వైపు రైతులు ఎక్కువగా మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. పత్తి పం టను మొదటిస్థానంలో 3,08,845 ఎకరాలు సాగు చేసేందుకు మొగ్గు చూపగా, రెండో స్థా నంలో వరి 1,92,796 ఎకరాల్లో, మూడో స్థా నంలో మొక్కజొన్న 96,992 ఎకరాల్లో పండిస్తారని అధికారులు అందనా వేస్తున్నారు. ఇం కా జిల్లా వ్యాప్తంగా 51,277 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు, కందులు 3,752 ఎకరాలు, 2,881 ఎకరాల్లో మెట్ట పంటగా జొన్నలు సాగు చేయనున్నట్లు అంచనాలతో వ్యవసాయాధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.
ఇందుకోసం మొత్తం జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని 59,579 క్వింటాళ్ల ధాన్యం అవసరమని గుర్తించారు. వరి 48,199 క్వింటాళ్లు, పత్తి 2,780 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని గుర్తించారు. ఈ పంటల సాగుకోసం 1,21,881 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని గుర్తించారు. ఇదిలా ఉండగా రైతులు తొందరపడి విత్తనాలు వేయకుండా నేలలో తేమ వచ్చాక విత్తడం మంచిదని పేర్కొంటున్నారు. నేల పూర్తిగా తడవకుండా విత్తనం వేస్తే మొలక శాతం తగ్గుతుందని, ఈనెల మూడో వారంలో వర్షాలను చూసుకొని పంట లు విత్తుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.