మూసాపేట/చిన్నచింతకుంట, నవంబర్ 7 : కార్తీక మాసం ప్రారంభమైన రోజు నుంచి ఇండ్లను శుద్ధి చే సుకుంటూ పరమ పవిత్రతో భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాదుకల స్పర్శకు సమయం ఆసన్నమైంది. పేదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తిస్వామి ఉద్దాల మహోత్స వం శుక్రవారం నిర్వహించనున్నారు. అందుకు స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డితోపాటు, కలెక్టర్ విజయేందిరబోయి ఆదేశాలతో అధికారులు, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్క రోజే లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కా వున ఉద్దాల ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుం డా ఎస్పీ కట్టుదిట్టమైన భద్రత ఏ ర్పా ట్లు చేశారు. అదేవిధంగా భక్తుల వాహనాలకు సరిపడే విధంగా పా ర్కింగ్ కూడా ఏర్పాట్లు చేశారు. భక్తు లు కూ డా సహకరించి కేటాయించిన పా ర్కింగ్ స్థలంలోనే వాహనాలను ని లపాలని అధికారులు, నిర్వాహకులు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఎన్నో కుటుంబాలకు కురుమూర్తి స్వామి (వెంకటేశ్వరస్వామి) ఇంటి ఇలవేల్పు.. స్వామి బ్ర హోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉ ద్దాల ఊరేగింపునకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. స్వామి వారి పాదుకల స్పర్శ లభించిందంటే చాలు వారి జన్మధన్యమైందని భావిస్తారు. పాదుకల స్పర్శ కోసం భక్తులు దారి పొడవునా పోటీపడతారు. పాదుక స్పర్శ లభిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే ఒక్క ఉద్దాల ఊరేగింపు రోజునే భక్తు లు లక్షలాదిగా తరలివస్తారు.
స్వామివారి ఉద్దాల ఊరేగింపు పూజా కార్యక్రమాలు ఉదయం 8గంటల నుంచే ప్రారంభమవుతాయి. మొదట పల్లమర్రిలో భక్తిశ్రద్ధలతో త యారు చేసిన చాటకు ప్రత్యేక పూ జలు చేస్తారు. చిన్నవడ్డెమాన్లో ఉ ద్దాల మండపం వరకు ఊరేగింపుగా తీసుకోస్తారు. అక్కడ ఉద్దాల మండపంలో ఆ గ్రామ దళితులతో కలిసి ప్ర జా ప్రతినిధులు, పాదుకలు పూజలు చేస్తారు. అనంతరం ఉద్దాలను తీసుకొచ్చిన చాటలో ఉంచి చేతలపై నుం చి తరలిస్తారు. పూజలు ముగిసిన వెంటనే ఉద్దాల స్పర్శ కోసం భక్తులు పోటీ పడతారు. దారి పొడవునా చాటకింద నుంచి భక్తులు ఊగిపోతారు. ఊరేగింపుగా స్వామివారి ఆలయం వ రకు ఉద్దాలను తరలిస్తారు. అక్కడ భక్తుల దర్శనం అనంతరం స్వామి ఆ లయానికి పాదుకలను తీసుకెళ్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి తి రిగి స్వామివారి ఉద్దాల మండపానికి తరలిస్తారు. ఉద్దాల ఊరేగింపునకు ఉ మ్మడి జిల్లాతోపాటు తెలుగు రా ష్ర్టా లు, కర్ణాటక నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలిస్తారు. ఎవరికి వారు వా రి తాహతుకు తగ్గట్టుగా ఎండ్ల బం డ్లు, ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు, జీపు లు, డీసీఎంలు, లారీలు, బస్సులు, మోటర్ సైకిళ్లు తదితర వాటిపై భక్తు లు తరలివస్తారు.