అచ్చంపేట, సెప్టెంబర్ 15 : స్థానిక సంస్థ ల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, అ చ్చంపేట నియోజకవర్గంలో ప్రజలు, పార్టీ క్యాడర్‌కు అండ గా ఉంటామని బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా రు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. కేసీఆర్‌ను ఎప్పుడు సీఎం చేయాలా..? అని ఎదురుచూస్తున్నారని అన్నారు. నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో అచ్చంపేట నియోజకవర్గంలోని ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశానికి కేటీఆర్ హాజరై మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు పార్టీ బీఫాం ఇచ్చి రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా అవకాశం కల్పించడంతోపాడు బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించామన్నారు. ఆయన పార్టీ మారినంత మాత్రాన ఆయన వెంబడి క్యాడర్ వెళ్లకపోవడం అభినందనీయమన్నారు.
ముందుగా అచ్చంపేట క్యాడర్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే అచ్చంపేట బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈనెల 28న అచ్చంపేటకు వస్తానని, సభకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు అండగా ఉంటామని కాంగ్రెస్ చేసిన ఆరు గ్యారెంటీలు మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసి బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పనైపోయిందని, చేతగాని సీఎం, మంత్రులతో ఏదీ కాదని తేలిపోయిందన్నారు.
సీఎం సొంత గ్రామంలో రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యుల వేధింపుల కారణంగా లేటర్ రాసి ఆత్మహత్యలు చేసుకున్న వారిపై ఎలాంటి కేసులు పెట్టలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసే వరకు ప్రజల తరుఫున కోట్లాడుతూనే ఉండాలన్నారు. ఈ రోజు రాష్ట్రంలో అన్నివర్గాలు, కార్మికులు, రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. యూరియా కోసం రైతుల కన్నీళ్లు రేవంత్‌రెడ్డికి కనిపించట్లేదని ధ్వజమెత్తారు.
చివరికి రైతులకు యూరియా కూడా ఇవ్వని దరిద్రపు పాలన కొనసాగుతుందన్నారు. కేసీఆర్‌ను ఓడించి ప్రజలు బాధపడుతున్నారని అన్నా రు. కొందరు మాజీ ఎమ్మెల్యేలపై కోపంతో వారిని ఓడిం చి కేసీఆర్ సీఎంగా ఉండాలని అనుకున్నారని, కానీ కేసీఆర్‌పై ప్రజలకు కోపం లేదన్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తదనుకోలేదని ప్రజలు మదన పడుతున్నారని తెలిపారు. మళ్లీ కేసీఆర్ ఎప్పుడొస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. అప్పుడే కొందరు ఎమ్మెల్యేలను మార్చి ఉంటే మళ్లీ కేసీఆర్ సీఎంగా ఉండేవారన్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఓడిపోవాలి.. కేసీఆర్ మాత్రం సీఎం గా ఉండాలని కోరుకున్నారన్నారు. అంతకుము ందు ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అచ్చంపేట నియోజకవర్గంలో పార్టీ, క్యాడర్ బలంగా ఉన్నదని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. స్వచ్ఛందంగా పార్టీ కోసం పనిచేస్తున్న క్యాడర్‌ను రాష్ట్రంలోనే అచ్చంపేటలో చూస్తున్నామని అన్నారు. పార్టీబలం తగ్గలేదని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీని గెలిపించుకునేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పార్టీశ్రేణులు, క్యాడర్‌ను ఎలాంటి సమస్య ఉన్నా తాను ఉండగా ఉంటానని భరోసానిచ్చారు. ప్రజలకు అండగా ఉండి సమస్యలపై కొట్లాడుదామని అన్నారు. స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికలకు వెళ్లడం లేదని ఆరోపించారు.
ఎప్పుడు ఎన్నికలు పెట్టిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. సమావేశంలో రైతు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు పోకల మనోహర్, మాజీ మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, మాజీ ఎంపీపీ పర్వతాలు, మైనార్టీ నాయకులు అమీనొద్దీన్, వంశీనాయక్ కౌన్సిలర్లు రమేశ్‌రావు, కుత్బుద్దీన్, శివ, మాజీ ఎంపీపీ కర్ణాకర్‌రావు, వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ మాకం తిరుపతయ్య, జగపతిరావు, తిరుపతయ్య, గోపాల్‌రెడ్డి, రవీందర్రావు, నరేందర్‌రెడ్డి, చెన్నకేశవులు, రవీందర్‌రెడ్డి, వరుణ్, వెంకటయ్య, జగన్మోహన్రెడ్డి, యాదయ్యగౌడ్, కమలాకర్రావుతోపాటు 400 మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు