అలంపూర్/మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జనవరి 13: కొంతకాలం గా అనారోగ్యంతో చికిత్స పొం దుతూ మాజీ ఎంపీ మంద జగన్నా థం ఆదివారం రాత్రి హైదరాబాద్ నిమ్స్ దవాఖానలో తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం మంద జగన్నాథం భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం బాధిత కు టుంబ సభ్యులను పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఓ మంచి నికార్సైన సీనియర్ నేత ను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.
వివాద రహితుడు, సౌమ్యుడు, తె లంగాణ మేలు కోరిన వ్యక్తిగా ఉమ్మడి పాలమూరులో రాజకీయంగా మంద తమదైన చెరగని ముద్ర వేశారన్నారు. సమాజానికి మంద అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మంద పార్థివదేహానికి పూల మాల వేసి నివాళులర్పించి బాధిత కుటంబ సభ్యులను పరామర్శించారు. కాగా మంద జగన్నాథం అం త్యక్రియలు సైదాబాద్ మహా ప్రస్థానంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది.
అలంపూర్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమ నాయకులు ,మంద జగన్నాథం అభిమాన నాయకులు వడ్డేపల్లి శ్రీనివాసులు, పటేల్ విష్ణువర్ధన్‌రెడ్డి, కుర్వ పల్లయ్య, మహేశ్గౌడు, ఇస్మాయిల్, రాములు, బీచుపల్లి, దుబ్బన్న, తుమ్మల రవికుమార్, ధర్మరాజు, ఊట్కూరు నర్సన్‌గౌడ్, అమరవాయి రోషన్న, పుల్లూరు ఏకాంత్, వల్లూరు గిడ్డారెడ్డి, రాంరెడ్డి, వల్లూరు కిశోర్, గార్లపాడు భూషణం తదితరులు మంద అకాల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వనపర్తి టౌన్, జనవరి 13 : నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతిచెందడంతో సోమవారం మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఆయన స్వగృహానికి వెళ్లి పార్థ్దివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంద జగన్నాథం సతీమణి, తమ్ముడు మంద వెంకట్‌కుమార్, కుమారుడు మంద శ్రీనాథ్‌లను పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.