కొల్లాపూర్ : ఈనెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ ( BRS ) రజతోత్సవ సభకు ( Silver Jublee) ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి గులాబీ దళం తరలి వెళ్లి కొల్లాపూర్ సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ( Beeram Harsavardan Reddy ) పిలుపునిచ్చారు.
ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని కోడేరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూరెడ్డి రఘు వర్ధన్ రెడ్డి స్వగృహంలో బీఆర్ఎస్ మండల ముఖ్య నాయకులతో సన్నాహక సభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని నాయకులకు , కార్యకర్తల సమీకరణపై దిశా నిర్దేశం చేశారు.
ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికలు ఏ క్షణం వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని ముందున్నదని మంచి కాలమని, భవిష్యత్ గులాబీ పార్టీ దేని ధీమాను వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపులపై దృష్టి పెట్టిందని విమర్శించారు. నియోజక వర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న ఐదు సంవత్సరాలలోనే దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించానని వెల్లడించారు. ముఖ్యంగా సాగునీటి విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని బాచారం కెనాల్ పనులను కూడా ప్రారంభించినట్లు తెలిపారు.