మరికల్, జూలై 12 : మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్‌సాగర్‌కు జలకళ తగ్గింది. రుతుపవనాలు వచ్చినా ఎల్‌నినో ప్రభావంతో వర్షాభా వ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వ రుణుడు మొఖం చాటేయడంతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. కోయిల్‌సాగర్‌కు కేసీఆర్ ప్రభు త్వ హయాంలో జూన్ మొదటి వారంలోనే నీటి పంపింగ్ ప్రారంభమయ్యేది. కృష్ణా నీటిని ఉం ద్యాల వద్ద పంపింగ్ చేసి పర్దీపూర్ చెరువుకు.. అక్కడి నుంచి తీలేరు వద్ద స్టేజీ-2లో పంపింగ్ చేసి కోయిల్‌సాగర్‌కు నీటిని విడుదల చేసేవారు.
కానీ ఈసారి కొద్దిగా వరద రాగానే ఉంద్యాల వద్ద మోటర్లను దేవరకద్ర ఎ మ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆఘమేఘా ల మీద ప్రారంభించారు. తర్వాత రెండ్రోజులు పంపింగ్ కొనసాగింది. ఎగువ రాష్ర్టాల్లో వ ర్షాలు లేకపోవడంతో తర్వాత మోటర్లను బంద్ చేశారు. రెండ్రోజుల్లో జరిగిన పంపింగ్‌తో పర్దీపూర్ చెరువు సగం కూడా నిండలేదు. 40 క్యూసెక్కుల నీరు జూరాల నుంచి విడుదల చేసినా పర్దీపూర్ చెరువు పూర్థి స్థాయిలో నిండక పోవడం తో కోయిల్‌సాగర్‌కు నీళ్లు వస్తాయో? లేవో? అన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు వరద ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది.
కేసీఆర్ ప్రభుత్వంలో జూన్ మొదటి వారంలోనే నాటి నారాయణపేట, దేవరకద్ర ఎమ్మెల్యేలు రా జేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ముందుచూపు తో వరద జలాలు వస్తాయని తెలియడంతోనే నీ టి పారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేసేవారు. జురాల డ్యాంకు వచ్చిన నీటిని ఉంద్యాల స్టేజీ-1 ద్వారా పంపింగ్ ప్రారంభించి పర్దీపూర్ చెరువును నింపి ఆక్కడి నుంచి స్టేజీ-2 తీలేరు పంప్‌హౌస్ వద్ద మోటర్లను ప్రారంభించి సాగర్‌కు నీటిని అందించేవారు.
నిత్యం 315 క్యూసెక్కుల నీటిని.. 15 క్యూసెక్కులు గొలుసుకట్టు చెరువులు నింపడానికి వదిలేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుత ఎమ్మెల్యేలకు సాగునీటి మీద ముందుచూపు లేకపోవడంతో సాగునీటి రాక ప్రశ్నార్థకంగా మారింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగర్‌కు నీరు వస్తుందో..? రాదో? తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. నీళ్లు వస్తాయని మరికల్, ధన్వాడ, దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాలకు చెందిన రైతులు వరి నాట్ల కోసం ఎదురుచూస్తున్నారు.
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులకుగానూ ప్రస్తుతం 10.9 అడుగులు మాత్రమే నీటి నిల్వ ఉన్నట్లు నీటి పారుదల శాఖ అధికారి ప్రతాప్‌సింగ్ తెలిపారు. ఎగువ నుంచి వరద రాక లేకపోవడంతో.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో.. యాసంగి సీజన్ పంటలకు నీటిని విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు పూర్తిగా పూర్తిగా తగ్గాయన్నారు.