కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లి గ్రామానికి చెందిన రమేశ్ ( Ramesh ) అనే విద్యార్థి పాలమూరు యూనివర్సిటీ నుంచి శుక్రవారం డాక్టరేట్ ( Doctorate ) పొందారు. రమేశ్ తల్లిదండ్రులు ఉసెనమ్మ, రాములు వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. నర్సాయపల్లి గ్రామంలో ఏడవ తరగతి , సింగోటం గ్రామంలో పదవ తరగతి, వనపర్తి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్‌లో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు.
పీజీ ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగంలో పూర్తి చేశారు.నెట్లో అర్హత సాధించడం ద్వారా పాలమూరు యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో 2021లో పీహెచ్డీ అడ్మిషన్ పొందారు.ప్రస్తుతం జీడీసీ నర్సాపూర్‌లో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
యూనివర్సిటీలో రసాయన శాస్త్ర విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అధ్యపకురాలు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నూర్జహాన్ పర్యవేక్షణలో బయోజెనిక్ సింథెసిస్ ఆఫ్ మోనో , బైమెటాలిక్ నానోపార్టికల్స్ ప్రిపరేషన్ ఫ్రమ్ అగ్రో-వేస్ట్ ఎక్స్ట్రాక్ట్స్ ఫర్ కటలైటిక్ , బయోమెడికల్ అప్లికేషన్స్ అనే అంశంపై రమేష్ పీహెచ్డీ చేశారు. వైవా-వోస్ ఉస్మానియా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ మురళధర్ రెడ్డి ఎక్సటర్నల్ ఎగ్జామినార్ ఆధ్వర్యంలో పీహెచ్డీ చేశారు.
పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో నానో పార్టికల్స్ ముఖ్య భూమిక : రమేశ్
పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో నానో పార్టికల్స్ ముఖ్య భూమిక వహిస్తాయని చేసిన పరిశోధన ఫలితాలు రైతాంగానికి ఉపయోగపడి రైతు దిగుబడిని పెంచే విధంగా ఉండాలని డాక్టరేట్ పొందిన రమేశ్ పేర్కొన్నారు. పరిశ్రమల నుంచి వెలువడిన వ్యర్ధపదార్థాల శుద్ధి, నేల సారవంతం పెంచడంలో ఈ నానో పార్టికల్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. రమేష్ చేసిన పరిశోధన పత్రాలు పలు అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి.
ఈ కార్యక్రమంలో ఉప కులపతి ఆచార్య జి ఎన్ శ్రీనివాస్ , రిజిస్ట్రార్ ఆచార్య రమేష్ బాబు , పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కే ప్రవీణ , అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ చంద్ర కిరణ్ , ప్రిన్సిపల్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి , విభాగాధిపతి డాక్టర్ విజయలక్ష్మి , అధ్యాపకులు డాక్టర్ ప్రదీప్ , డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ సిద్ధిరాములు , విద్యార్థులు పాల్గొన్నారు.