Murder | జడ్చర్లలో కిడ్నాప్.. మైలారం వద్ద చంపి పాతిపెట్టినట్లు గుర్తింపు
Murder | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన రంగసాని యాదవ్ (45) హత్యకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది.
కొల్లాపూర్ : నాగర్కర్నూల్ జిల్లా ( Nagarkurnool district ) కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన రంగసాని యాదవ్ (45) హత్యకు ( Murder) గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల జూలై 29న జడ్చర్ల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను కిడ్నాప్( Kidnap) చేశారు. ఈ కేసులో కుటుంబ సభ్యులు కోడేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దాదాపు 22 రోజులుగా దర్యాప్తు నిర్వహించారు.
తాజాగా, బల్మూరు మండలం మైలారం గ్రామ సమీపంలో ఆయనను హత్య చేసి పాత పెట్టినట్లు పోలీసులు నిర్దారించారు. ఈ సంఘటనపై డీఎస్పీ, కోడేరు, అచ్చంపేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ కేసులో అచ్చంపేట ప్రాంతానికి చెందిన ఏడుగురున్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు.
రంగసాని యాదవ్ను ఎందుకు కిడ్నాప్ చేసి హత్య చేశారన్న విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. వ్యాపార సంబంధిత తగాదాలు ఉన్నాయా? లేక ఇతర కారణాలున్నాయా? గుప్తనిధుల కోసం వెళ్లి బలయ్యాడా? అనే అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో మైలారం గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

