అడుగడుగునా మోకాళ్ల లోతు గుంతలు.. చినుకు పడితే ఆ గుంతల్లో నీరు.. ఇలాంటి రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే నరకాన్ని తలపిస్తుందని మైలారం గ్రామప్రజలు వాపోతున్నారు.
గిరిజన గ్రామాలన్ని అటువైపే ఉన్నాయి. సుమారు 20 కిలోమీటర్ల పొడవున ఉన్న 15 గ్రామాల ప్రజలు రహదారి లేక ఇప్పటివరకు పడిన బాధలు అన్నీఇన్నీ కావు. ఆ అటవీ ప్రాంతం నుంచి బయటకు రావాలంటే నరకం కనిపించేది.