Mylaram road | గన్నేరువరం,ఆగస్టు8: అడుగడుగునా మోకాళ్ల లోతు గుంతలు.. చినుకు పడితే ఆ గుంతల్లో నీరు.. ఇలాంటి రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే నరకాన్ని తలపిస్తుందని మైలారం గ్రామప్రజలు వాపోతున్నారు. మండలంలోని మైలారం నుండి మండలకేంద్రానికి వెళ్లంటే రోడ్ల మీద ప్రయాణం చేయడం అనేది యమపురికి ప్రయాణం చేసినట్లుగా ఉందని ఆ గ్రామ ప్రజలు గోడు వెల్లబోసుకుంటున్నారు.
పూర్తిగా దెబ్బతిని ఉన్న మట్టి రోడ్డు పై ప్రయాణం చేయడం నిత్యం సవాళ్లతో కూడినట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.