వనపర్తి టౌన్, జూన్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణీత సమయంలో కట్టి సాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సోషల్ ఫౌండేషన్ (టీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ జల వనరులు, వ్య వసాయం, నాడు, నేడు, రేపు అనే అంశంపై హైదరాబాద్‌లోని షోయబ్ హాల్ సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి హాజరై నీళ్ల ప్రాధాన్యత, నేటి పాలకులు సాగునీటి నిల్వలో నిర్లక్ష్యం చేస్తున్న తీ రును వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ గతంలో సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో భూములు వ్యవసాయానికి పనికిరాకుండా పోవడం, సకల జీవరాశుల జీవనం దుర్వేద్యం కా వడం గమనించిన నాటి తెలంగాణ పాలకులు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి నీటిని నిల్వ చేసి భావితరాల భవిష్యత్ కోసం బాటలు వేశారని కొనియాడారు.
నే టి పాలకులు ముందుచూపు లేకుండా వ్యవహరించడంతో మనకు దక్కాల్సిన నీటి వాటాలు ఇతర రాష్ర్టాలకు తరలుతున్నాయని దుయ్యబట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల వంటి ప్రాజెక్టులు కట్టడానికి పాలకులు 23, 30, 40 ఏండ్లు సాగదీశారని కానీ కేసీఆర్ గారు మూడున్నర ఏండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కోటి ఎకరాలకు నీళ్లందించారని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణం 90శాతం పూర్తి చేశారని, ప్రస్తుత పాలకులు మిగిలిన 10శాతం పనులు కూడా చేయలేకపోతున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొ నసాగితే రాబోయే తరాలు మరో గ్రహం మీద ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం వస్తుందని జోస్యం చె ప్పారు. ఇప్పటికైనా పాలకులు ఆలోచించి రైతులకు, ప్రజలకు క్షేమం చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నా రు. ఈ సమావేశానికి నర్సింహారెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశంలో సీపీఎం కార్యదర్శి జా న్‌వెస్లీ, శ్రీధర్‌రావు, దేశ్‌పాండే, వేణుగోపాల్ స్వామి, అయాచితం శ్రీధర్, వెంకటేశం పాల్గొన్నారు.