న్యూఢిల్లీ, మార్చి 9 : పశ్చిమాసియా యుద్ధం సోమవారం పదోరోజుకు చేరుకున్నది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులు కొనసాగాయి. ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ విస్తృతస్థాయి మిలిటరీ దాడులను చేపట్టింది. టెహ్రాన్, ఇస్ఫహాన్, దక్షిణ ఇరాన్ అంతటా మౌలిక సదుపాయాలపై దాడులు చేపట్టినట్టు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. ఇరాన్లో ఉగ్రవాద పాలనలోని స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు ఐడీఎఫ్ తెలిపింది.
మరోవైపు గల్ఫ్ దేశాల భూభాగాలపై సోమవారం ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు కొనసాగించింది. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ఖతార్ అన్ని పక్షాలను కోరింది. ఇరాన్ దాడుల్లో బహ్రెయిన్ ప్రభుత్వ చమురు సంస్థ ‘బాప్కో’ రిఫైనరీ మంటల్లో చిక్కుకోవటంతో, అసాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయని.. రోజువారీ ఆపరేషన్ నిలిపివేశామని ప్రకటించింది.