సొమ్మొకరిది.. సోకొకరిది..!
మక్తల్ నియోజకవర్గ రైతులకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం ద్వారా సంగంబండ పెద్దవాగుపై ప్రాజెక్టును నిర్మించారు. అయితే, సంగంబండ ప్రాజెక్ట్ పునరావాస నిర్వాసితులకు చెందిన మిగులు నిధుల విడుదలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్లు వ్యవహరిస్తున్నది.
- సంగంబండ రిజర్వాయర్ నిర్వాసితులను మోసం చేసిన నాటి కాంగ్రెస్..
- రాష్ట్ర ఏర్పాటు తరువాత ప్రజల కష్టాలు తెలుసుకున్న ఉద్యమనేత
- రూ.26.35 కోట్లు విడుదల చేసిన కేసీఆర్ సర్కారు
- ఎన్నికలు రావడంతో నిలిచిన డబ్బుల పంపిణీ
- కాంగ్రెస్ సర్కారే నిధుల విడుదల చేసిందని గొప్పలు
- నేడు సంగంబండకు డిప్యూటీ సీఎం, మంత్రి రాక
మక్తల్ టౌన్, మార్చి 12 : మక్తల్ నియోజకవర్గ రైతులకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం ద్వారా సంగంబండ పెద్దవాగుపై ప్రాజెక్టును నిర్మించారు. అయితే, సంగంబండ ప్రాజెక్ట్ పునరావాస నిర్వాసితులకు చెందిన మిగులు నిధుల విడుదలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్లు వ్యవహరిస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో సంగంబండ పెద్దవాగుపై రూ.2,148 కోట్లతో 3.317 టీఎంసీల సామర్థ్యం గల సంగంబండ రిజర్వాయర్‌ను నిర్మించారు. ఈ ప్రా జెక్టు నిర్మాణంలో సంగంబండ, ఉజ్జెల్లి, గార్లపల్లి గ్రా మాల ప్రజలు తమ భూములు, ఇండ్లను సైతం కోల్పో యి పూర్తిస్థాయిలో నిర్వాసితులయ్యారు. ఈ మూడు గ్రామాల ప్రజలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసింది. గతంలో మంత్రిగా పనిచేసిన ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి నిర్వాసితులతో అనేక దఫాలుగా చర్చలు జరిపినా.. ఇబ్బందులను తొలగించడంలో విఫలమయ్యారని నిర్వాసితులు చర్చించుకునేవారు. కాగా, ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రిజర్వాయర్ బాధితుల కష్టాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారు.
నిర్వాసితులకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రావాల్సిన బ్యాలెన్సింగ్ డబ్బులను చెల్లించాలనే ఉద్దేశంతో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నాటి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి 24.08.2023న జీవో నెంబర్ 295 విడుదల చేయించారు. దీంతో సంగంబండ, ఉజ్జెల్లి, గార్లపల్లి గ్రామాలకు రావాల్సిన రూ. 26,35,23,410 కూలి డబ్బులను కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, ఆ నిధుల పంపకం చేపట్టేలోపే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన నిధులను తామే విడుదల చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే మూడు ముంపు గ్రామాలు తిరిగి చెప్పుకొంటున్నారు. అందు లో భాగంగానే బుధవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సంగంబండ పర్యటనకు పిలిపించుకొని ఆర్భాటాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా రు. దీంతో నిర్వాసితులు లోలోపల నవ్వుకుంటున్నా రు. రిజర్వాయర్ పునరావాస నిధుల విడుదలకు సం బంధించి లేనిపోని గొప్పలు చెప్పుకొంటూ సంబురా లు చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ దివాళాకోరుతనానికి ని దర్శనం అని ప్రజలు బాహాటంగా చర్చించుకోవడం విశేషం.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

