జహీరాబాద్, జూలై 30: జహీరాబాద్ మున్సిపాలిటీలో కాం గ్రెస్‌కు మద్దతిచ్చి తప్పు చేశామని జహీరాబాద్ మున్సిపాలిటీలోని రాంనగర్ వార్డు ఎంఐ ఎం నేత, కౌన్సిలర్ భర్త ఇర్మీ యా నిప్పులు చెరిగారు. మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడి ఆరు నెలలు గడిచినా వార్డులో తాగునీరు, వీధిలైట్లు, డ్రైనేజీ వంటి కనీస సౌకర్యలు, స్థానిక సమస్యలు పరిష్కరించలేకపోయామని ఆసహనం వ్యక్తం చేశారు. జహీరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని గురువారం నిర్వహించారు.
వర్షాకాలంతో తీసుకోవాల్సిన చర్యలు, బోనాల పండుగ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా పాలక వర్గం దృష్టికి సమస్యలు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మున్సిపల్ కార్యాలయం ఎదుట కౌన్సిలర్ సోని భర్త ఇర్మీయా తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ చైర్మన్ ఎన్నికల్లో కీలకమయ్యామని, తమ మద్దతుతో కాంగ్రెస్ మున్సిపల్ పీఠమెక్కి తమ వార్డులో నెలకొన్న సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్, కమిషనర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు, మూడుసార్లు సమావేశాలు నిర్వహించినా సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆరోపించారు. ఎంఐఎం తరఫున కాంగ్రెస్‌కు మద్దతు తెలిపినందుకు ప్రాయశ్చిత్తంగానే ఈ శిక్ష అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.