మహబూబ్‌నగర్, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈసారి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని ఈసారి డిజిటల్ విధానంలో నమోదు చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించి ప్రతి నియోజకవర్గానికి ఓ ఇన్చార్జీని నియమించారు. ఇలా మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 నియోజకవర్గాలకు ఒక్కో ఇన్చార్జి చొప్పున 14 మందిని నియమించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదివరకే డిజిటల్ సభ్యత్వ నమోదుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు.
డిజిటల్ సభ్యత్వ నమోదును వేగవంతంగా నిర్వహించేందుకు ఇన్చార్జీలను నియమించి బాధ్యతలను అప్పగించారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, నారాయణపేకు రాజీవ్‌సాగర్, జడ్చర్లకు పాల్వాయి స్రవంతి, దేవరకద్రకు పల్లె రవికుమార్, మక్తల్‌కు దుడిమిట్ల బాలరాజు, వనపర్తికి ఇంతియాజ్‌ఇసాక్, గద్వాలకు ఆంజనేయగౌడ్ను నియమించారు. అదేవిధంగా అలంపూర్ ఎస్సీ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, నాగర్‌కర్నూల్‌కు జహంగీర్, అచ్చంపేట ఎస్సీ నియోజకవర్గానికి నూలి శుభప్రత్పాటిల్, కల్వకుర్తికి రజనీసాయిచంద్, షాద్‌నగర్‌కు బైకని శ్రీనివాస్‌యాదవ్, కొల్లాపూర్‌కు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డిలను నియమించారు.