గద్వాల, సెప్టెంబర్ 29 : జూరాల ప్రాజెక్టుకు వర ద కొనసాగుతుండడంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. ఎగువ నుంచి జూరాలకు 72,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా.. నాలుగు గేట్లు ఎత్తారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లకు గానూ ప్రస్తుతం 318.430 మీటర్లు, పూర్తిస్థా యి నీటి నిల్వ 9.657 టీఎంసీలకు గానూ 9.480 టీఎంసీలుగా ఉన్నది. కాగా ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 500, భీమా లిఫ్ట్-1కు 750, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 50 విద్యుదు త్పత్తికి 38,251 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
అయిజ, సెప్టెంబర్ 29 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాం కు వరద కొనసాగుతున్నది. ఆదివారం ఇన్‌ఫ్లో 10,631 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 11, 571 క్యూసెక్కులు నమోదైంది. 105.788 టీఎంసీల గరిష్ఠసామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్ర స్తుతం 101.773 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 1633 అడుగుల నీటి మట్టానికి గానూ ప్రస్తుతం 1632 అడుగులు ఉన్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 13,797 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 13,150 క్యూసెక్కులు నమోదైంది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 647 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా ప్ర స్తుతం ఆనకట్టలో 9.3 అడుగుల మేరకు నీటి మట్టం ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వ ర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు వర ద కొనసాగుతున్నది. ఆల్మట్టి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 48,108 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 22,020 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్టు గరిష్ఠస్థాయి నీటిమట్టం 1705 అడుగులకు గానూ 1704.69 అడుగులు ఉన్నది. గరిష్ఠనీటిమట్టం 129.72 టీఎంసీలకు గానూ, ప్రస్తుతం 128.01 టీఎంసీల నిల్వ ఉన్నది. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 19,844 క్యూసెక్కులు ఉండగా, అ వుట్ ఫ్లో 14,225 క్యూసెక్కులు నమోదైంది. గరిష్ఠస్థాయి నీటి మట్టం 1615 అడుగులకు గానూ ప్ర స్తుతం 1614.99 అడుగులు, పూర్తిస్థాయి నీటి ని ల్వ 37.40 టీఎంసీలకు గానూ ప్ర స్తుతం 37.64 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.