మహబూబ్‌నగర్, జూన్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు.. ప్రస్తుతం డ్యాంకు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో పలు క్రస్ట్ గేట్ల రోప్‌వేలు తెగిపోయాయి. దీంతో ప్రాజెక్టు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. గేట్లకు మరమ్మతులు చేస్తున్న తరుణంలో ఏర్పాటు చేసిన రోప్‌వేలు కొన్ని తెగిపోవడం.. మరికొన్ని వదులు కావడం హాట్ టాపిక్‌గా మారింది. 9వ గేటు వద్ద రోప్‌వే తెగిపోయింది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో ప్రాజెక్టుకు ఈ దుస్థితి నెలకొనడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సర్కారు వచ్చి 19 నెలలైనా మరమ్మతులపై దృష్టి సారించకపోవడంతో.. చివరి నిమిషంలో హడావుడిగా విడుదల చేసిన రూ.కోటి నిధులకు చేపట్టిన మరమ్మతుల్లో డొ ల్లతనం బయటపడింది. ప్రాజెక్టు గేట్లను మరమ్మతులు చేపట్టేందుకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏటా నిధులు కేటాయి స్తూ వచ్చింది.. 2022లో ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికతో మరమ్మత్తుల కోసం రూ.12 కోట్లతో టెండర్లు పిలిచారు. స్వప్న కన్స్ట్రక్షన్ కంపెనీ పనులు దక్కించుకోగా.. అదే సమయంలో ప్రభుత్వం మారింది. అప్పటికే చేసిన పనులకు కాంట్రాక్టర్‌కు రూ.8 కోట్ల బిల్లులను సర్కారు బకాయి ప డింది.
దీంతో అధికారులు ఏటా మరమ్మతుల కోసం ప్రభుత్వానికి నివేదించినా ఫలితం లేకపోయింది. రేవంత్ సర్కారు వచ్చి 19 నెలలైనా అప్పటికే విడుదలైన నిధులను ఖర్చు చే యడం.. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రాజెక్ట్ మనుగడ ప్ర శ్నార్థకమైంది. 28, 41, 45, 51 నెంబర్ గేట్లకు రోప్ పూర్తి చేయగా.. 8, 12, 19, 27 గేట్ల పనులు పూర్తి కావాల్సి ఉన్నది. కాళేశ్వరంలో ఒకటి, రెండు పిల్లర్లు కుంగిపోతే మరమ్మతులు గాలికి వదిలేసి ప్రాజెక్టు మునిగిపోయిందని ప్ర చా రం చేసిన సీఎం రేవంత్ సొంత జిల్లాలో జూరాల ప్రాజెక్టు డే ంజర్ జోన్లో పడేశారని మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు ఆరోపించారు. గేట్లపై అనుమానాలు వ్యక్తం చేశారు.